-ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఈ ఏడాది ఖరీఫ్ లో అన్నదాతలు నానా ఇబ్బందులు పడ్డారని, ఆరుగాలం కష్టం చేసి తీసుకొచ్చిన రంగు మారి, నూకలైన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రైతుకు ఆపన్న హస్తం అందించాలని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ ను అభ్యర్థించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన జాయింట్ కలెక్టర్ చాంబర్లో జె సీ ను కలిసి రైతుల కష్టాలను ఏకరువు పెట్టారు. గడిచిన డిసెంబర్ నెలలో తరచూ బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడడంతో పాటు తమిళనాడులో వచ్చిన తుపాను కారణంగా కృష్ణాజిల్లాలో దాదాపు వారం రోజులు పాటు ఆకాశం మేఘావృతమై అకాల వర్షాలు పడడంతో ఆందోళన చెందిన రైతాంగం హడావిడిగా కోతలు కోసి పనలను వేయడం జరిగిందన్నారు. ఆ పనలు సరిగా ఆరకపోవడం, ఆ తరువాత అడపా దడపాగా వర్షాలు కురవడం జరిగిందన్నారు.
సంక్రాంతి పండుగ అనంతరం రైతులు కుప్పలను ఇప్పుడిప్పుడే తీస్తున్నారని, అయితే కుప్పల లోని పనలు కొంత పాయ, నూకలగా ధాన్యం రాలడంతో రైతులు ఎంతో నిరాశ చెందుతున్నారన్నారని, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, సివిల్ సప్లై డిస్టిక్ మేనేజర్ శ్రీధర్ కు ఎమ్మెల్యే పేర్ని నాని సూచించారు.
ఇదే విషయమై, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రేపు (బుధవారం) ఉదయం కృష్ణాజిల్లాలోని శాసనసభ్యులు అందరం కలిసి రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు
కృష్ణాజిల్లాలో ఇప్పటివరకు 34,600 మంది రైతుల నుండి 3 లక్షల 17 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు.29,500 మంది రైతుల 2 లక్షల 82 వేల టన్నుల ధాన్యానికి సంబంధించిన నగదును భోగి పండుగ ముందు 42 కోట్ల రూపాయలు, కనుమ పండుగ రోజు 164 కోట్ల రూపాయలు అందజేసినట్లు ఎమ్మెల్యే పేర్ని నాని వివరించారు.
రైతు పక్షపాతిగా పేరుందిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు ఎక్కడ మోసపోకుండా ఎంతో బాధ్యతగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తుందని, చక్కని గిట్టుబాటు ధర రైతుకు అందించిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశంసించారు. ప్రతి ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంలో తేమశాతం కొలిచే పరికరాలు, అలాగే నూక శాతం లెక్కించే యంత్రాల్లో ఉండేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ సహకార పరపతి సంఘాలే జిల్లాలో దాదాపు 90 శాతం దాన్యం కొనుగోలు చేశారని, రైతు ఖర్చులు సైతం వారే చెల్లించినట్లు ఎమ్మెల్యే పేర్ని నాని చెప్పారు.
Prajavartha Online Telugu News