Breaking News

ఫ్యామిలీ ఫిజీషియన్ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..

-ముందస్తు ప్రణాళికకు చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ సేవల్లో జిల్లాను అగ్రగామిగా నిలపండి..
-జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ప్రాంతాల ప్రజల ఇంటి ముంగిటకే వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో జిల్లాను అగ్రగామిగా నిలపాలని కలెక్టర్ ఢిల్లీ రావు వైద్యాధికారులకు సూచించారు. ఫ్యామిలీ డాక్టర్ సేవలు అమలుపై మంగళవారం జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు నగరంలోని అయన కార్యాలయం నుండి వైద్యాధికారులతో గూగుల్ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కాన్ఫెరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకూ ధనిక వర్గాలు మాత్రమే స్వంత ఖర్చులతో ఫ్యామిలీ డాక్టర్ ను నియమించుకుని వారి ద్వారా వైద్య సేవలు పొందుతున్నారన్నారు. పేద ప్రజలకు కూడా అటువంటి వైద్య సేవలు ఇంటి వద్దనే అందించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ ను తీసుకు వచ్చారన్నారు. ఈ విధానం ద్వారా ప్రతీ పేదవానికి ఇంటివద్దే వైద్య సహాయం అందించేందుకు అక్టోబర్ నెల నుండీ ఫ్యామిలీ డాక్టర్స్ కాన్సెప్ట్ అమల్లోకి వచ్చిందన్నారు. దివంగత ముఖ్య మంత్రి వై. ఎస్. రాజశేఖర రెడ్డి 108, 104 అంబులెన్సులు ఆరోగ్య శ్రీ వైద్య సేవలు ద్వారా కార్పొరేట్ వైద్యముతో ప్రజల హృదయాలలో చిరస్మరణీయులుగా నిలిచారన్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్ అమలు ద్వారా పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో జిల్లాను అగ్రగామిలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 23 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, 239 వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ ల వైద్య బృందాల ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు అందించేందుకు ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లాలన్నారు. గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వైద్య పరీక్షలు అవసరమైన మందులను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. సాధారణ ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికీ గర్భిణీ స్త్రీలకూ బాలింతలకు నవజాత శిశువులకు కౌమార బాలికలకు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను పంపిణీ చేయాలన్నారు. క్షయ, హెచ్ ఐ వి, కామెర్లు, మధుమేహం, రక్తపోటు, చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు పరీక్షలు నిర్వహించి వైద్యసేవలు అందించడంతో పాటు కేసు వివరాలను నమోదు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.

గూగుల్ కాన్ఫెరెన్స్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి ఏమ్. సుహాసిని,ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ నోడల్ ఆఫీసర్ డా. మోతీ బాబు, డి పి ఎం ఓ డా. నవీన్, జిల్లాకు చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *