విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తన పాదయాత్ర లో చూసిన వరద ముంపు వాసుల కష్టాలు తీర్చే విధంగా రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని అసెంబ్లీలో ప్రకటించడంతో పాటు వెనువెంటనే నిధులు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 21వ డివిజన్, 108 సచివాలయ పరిధిలోని కృష్ణలంక రణధీర్ నగర్ కట్ట ప్రాంతంలో నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తో కలిసి ఇంటింటికీ వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల క్యాలెండర్ ను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో కృష్ణానది కి వరదలు వస్తే ఈ ప్రాంతావాసుల గూడు,గుడ్డ వదిలేసి పునరావాస కేంద్రాల్లో తలదాచుకొనేవారు అని, అక్కడ కనీసం కడుపు నిండా తిండి కూడా దొరకని దుర్భర పరిస్థితులు వుండేవాని అన్నారు. ఆ పరిస్థితి చూసి చలించిన జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే 125 కోట్ల రూపాయల తో రిటైనింగ్ వాల్ పూర్తి చేయడంతో పాటు, మరో 130 కోట్ల రూపాయలు వెచ్చించి మూడోదశ వాల్ నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టడం జరిగిందని అన్నారు. ప్రజల కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం వాల్ నిర్మాణం చేపడితే ఓర్వలేక వారి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రతిపక్షాలు మీ ఇళ్ళు తొలగిస్తారని అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఎవరి ఇళ్లను తొలగించడం జరగదని, మరి లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇళ్ళు తొలగించాల్సి వస్తే వారికి ఉచితంగా అన్ని సౌకర్యాలతో ఇళ్ళు ఇచ్చిన తరువాతే తొలగిస్తామని భరోసా ఇచ్చారు. నిన్న టీడీపీ నాయకుడు లోకేష్ మాట్లాడుతూ జగన్ కు భయమంటే ఏమిటో చూపిస్త అది ఇది అని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు అని, నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న సోనియాగాంధీ కే జగన్ భయపడలేదు అని, కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలవని నీకు భయపడలా అని ప్రశ్నించారు. ఒక్కటి నుండి 151 సీట్లు సాధించిన జగన్ గారితో నీకు పోలిక అని ఎద్దేవా చేశారు. యువగళం కు జనాలు రాక, ప్రజలు పట్టించుకోక పాపం సెల్ఫీ లతో కాలం గడిపేస్తున్నారని, దానికి సెల్ఫీ గళం అని పేరు పెట్టుకొంటే బాగుండేది అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,వైస్సార్సీపీ నాయకులు టి.పి రెడ్డి,పుప్పాల రాజా,సుబ్బారెడ్డి,గోగు గౌరీ, దుర్గారావు,మెడ రమేష్,మద్దెల పవన్ మరియు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News