
-ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. షార్ట్ ఫిలిం కాంటెస్ట్-2023
-ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహిద్దాం… :- బాలీవుడ్ నటీమణులు అంకితా బ్రహ్మ, యుక్తా రక్షిత్
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహించడంతో పాటు వారిలోని నైపుణ్యాన్ని వెలికితీయడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మధు ఫిలిం స్టూడియోస్, మా ఏపి ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం కాంటెస్ట్-2023 పోటీలు నిర్వహించడం ముదావహమని ప్రముఖ దర్శకులు కస్తూరి శ్రీనివాస్, ఎం.వి.రఘు, సంగీత దర్శకులు సాకేత్ సాయిరాం అన్నారు. మంగళగిరి ఆత్మకూరులోని హ్యాపీ రిసార్ట్స్‌లో ఆదివారంనాడు జరిగిన షార్ట్ ఫిలిం కాంటెస్ట్-2023 కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం బాలీవుడ్ నటీమణులు అంకితా బ్రహ్మ, యుక్తా రక్షిత్‌లు పాల్గొని మాట్లాడుతూ, సినిమా పరిశ్రమ అంటే ఒక యూనిటీ అని ప్రపంచ దేశాలు మన భారతీయత సాంకేతిక పరిజ్ఙానంతో కూడిన చిత్రాలను ఎంతగానో ప్రోత్పహిస్తున్నారని తెలిపారు. చిన్న దర్శకులు నుండి పెద్ద దర్శకులు దాకా ప్రతి ఒక్కరిలో ఓక క్రియేటీవీటి, నూతన కధాంశము ఉంటేనే ఆ కధ ప్రాధాన్యత సంతరించుకుంటుందని ఈ తరహా లఘు చిత్రాల పోటీలను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించడం ప్రశంసనీయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తాము ముఖ్య అతిథులుగా రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అంబటి మధుమోహన్ కృష్ణ మాట్లాడుతూ, షార్ట్ ఫిలిం కాంటెస్ట్-2023 పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించిందన్నారు. ఎంట్రీలలో టెక్నికల్ వ్యాల్యూ మరియు కథాంశంతో పాటు ప్రతిభ కలిగిన అందరినీ ఎంపిక చేశామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో త్వరలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతిభ కలిగిన వారందరినీ అభినందిస్తూ వారు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కళాభిమానం కలిగిన తనకు చిత్రాలు అంటే ఎంతో ఇష్టమని ఇటువంటి కళాత్మకమైన చిత్రాలను ప్రోత్సహించడం ద్వారా వారిలో సామర్ధ్య నైపుణ్యం బయటకు వస్తుందని పేర్కొన్నారు. న్యాయ నిర్ణేతలుగా విచ్చేసిన ప్రముఖ దర్శకులు, సినీ విమర్శకులు ప్రముఖ మేథావులచే చిత్రాల ప్రదర్శన అనంతరం న్యాయ నిర్ణేతల తుది నిర్ణయం మేరకు విజేతలకు ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంపిక కాని వారంతా కూడా నిరాశ చెందకుండా భవిష్యత్తులో మంచి కాన్సెప్ట్, క్రియేటీవీటి ఉన్న చిత్రాలను నిర్మించాలని కోరారు.
మొదటి బెస్ట్ షార్ట్ ఫిలిం గా ఐ వాంట్ హాలిడే, రెండో బెస్ట్ షార్ట్ ఫిలిం గా హగ్, మూడో బెస్ట్ ఫిలిం గా మా నాన్న ఆల్కహాలిక్ నిలిచాయి. బెస్ట్ డైరెక్టర్ – ఐ వాంట్ హాలిడే, బెస్ట్ మ్యూజిక్ – హగ్, బెస్ట్ DOP – స్వేఛ్చ, బెస్ట్ యాక్టర్ – రామ స్వామి (పశువు), బెస్ట్ యాక్ట్రెస్ – స్రవంతి (పశువు), స్పెషల్ అప్ప్రీసియేషన్ అవార్డు ఫర్ చైల్డ్ ఆర్టిస్ట్ – పీ. సాయి హశ్విన్ (చైల్డ్ బెగ్గర్) కు లభించాయి. ఈ సందర్భంగా విజేతలకు గౌరవ అతిథులుగా విచ్చేసి బాలివుడ్ నటీమణులు అంకితా బ్రహ్మ, యుక్తా రక్షిత్ చేతులు మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యర్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News