Breaking News

రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణ కు కృషి చేయండి.

-గ్రామాలలో యోగ కేంద్రాలు వాకింగ్ ట్రాకులు, లాఫింగ్ క్లబ్ లు ఏర్పాటుకు చర్యలు తీసుకోండి.
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు కృషి చేయాలని గ్రామాలలో యోగ కేంద్రాలు వాకింగ్ ట్రాకులు, లాఫింగ్ క్లబ్ లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు చేపట్టవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు సంబందిత అధికారులతో గూగుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ పేద ప్రజాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వైద్యరంగానికి కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసి అత్యధిక మౌలిక వసతులను కల్పించడం జరిగిందన్నారు. ఉన్నత వర్గాల వారితో సమానంగా పేద ప్రజలకు కూడా ఇంటి వద్దే వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ఫామిలీ ఫీజిషియన్ విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఫ్యామిలీ ఫీజిషియన్ కాన్సెప్ట్ ను అక్టోబర్ మాసం నుండి జిల్లాలో ట్రయల్ రన్ గా ప్రారంభించి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిని వైద్యులు గుర్తించడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1 లక్ష 34 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వీరిలో 25,500 మంది రక్తపోటు, 24,500 మంది మధుమేహ వ్యాధితో భాదపడుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. 6200 మంది గర్భిణీలు 3430 మంది బాలింతలకు పరీక్షలు నిర్వహించగా 450 మందిలో రక్తహీనత ఉన్నట్లు వైద్యులు నిర్దారించడం జరిగిందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికీ అవసరమైన వైద్య సహాయం అందించి ఉచితంగా మందులను పంపిణీ చేయాలన్నారు. వ్యాయామం, యోగాలను ఆచరించడం ద్వారా మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుందన్నారు. పట్టణ ప్రాంతాలలో ఇప్పటికే యోగా కేంద్రాలు, వాకింగ్ ట్రాకులు, లాఫింగ్ క్లబ్ లు అందుబాటులో ఉన్నాయని వాటి సంఖ్య మరింత పెంచేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో యోగా కేంద్రాలు, వాకింగ్ ట్రాకులు ఏర్పాటుకు మండల అధివృద్ది అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్సీడీ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేయాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 72 ఎ ఎన్ ఎమ్ పోస్టులు ఖాళిగా ఉండటం వల్ల సర్వే ప్రక్రియ ఆలస్యం అవుతుందని వైద్య అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా గ్రామీణ ప్రాంతంలో అదనంగా ఉన్న ఎ ఎన్ ఎమ్ సేవలను వినియోగించుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల అనుమతికి తగు ప్రతిపాదనలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు . ఎన్సీడీ సర్వే ప్రక్రియను మున్సిపల్ అధికారులు, ఎంపిడివో లు పర్యవేక్షించి ఎప్పటికప్పుడు నివేదికలను అందజేయాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. గూగుల్ కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. ఎం. సుహాసిని, ఆర్ బి కె ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ డా. మాధవి, అర్బన్ ఎస్పిహెచ్ వో డా. నరసింహ నాయక్, వైద్యాధికారులు డా. నవీన్, డా. పద్మావతి , డా. మోతిబాబు, జిల్లాకు చెందిన మున్సిపల్ అధికారులు, ఎంపిడివోలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు

-ప్రజలు అత్యవసర సమాచారం కోసం 08672-252399 నంబర్‌కు ఫోన్ చేయాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *