Breaking News

రాజీవ్ గాంధీ పార్క్ ను పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజీవ్ గాంధీ పార్కు నందలి మిగిలిన అభివృద్ధి పనుల యొక్క పురోగతిని న‌గ‌ర పాల‌క సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ సంబందిత అధికారుల‌తో కలసి పర్యవేక్షించి పార్కు ఎంట్రన్స్ లో ఉన్న టికెట్ కౌంటర్ నందు పరిశీలించి సంబందిత అధికారుల‌కు పలు ఆదేశాలు జారిచేసినారు. పార్క్ ఆవరణలో మిగిలిపోయిన చిన్న చిన్న పనులను వేగవంతముగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా పార్క్ ఆవరణలో గల పనికిరాని స్క్రాబ్ మరియు మట్టి కుప్పలను తొలగించాలని సంబందిత అధికారుల‌కు ఆదేశాలు జారిచేసినారు. పర్యటనలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, పార్క్ సూపర్ వైజర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

​రాజమండ్రిలో ముగిసిన పోషణ్ మాహ్ ప్రదర్శన : ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరు

​రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *