Breaking News

బిక్కవోలు, అనపర్తి మండలాల్లో కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటన

-రైతులు నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం
-యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కు చర్యలు తీసుకుంటాం
-జిల్లా యంత్రాంగం రైతాంగానికి పూర్తిగా అండగా నిలుస్తారు
-కలెక్టర్ మాధవీలత
-మాది రైతు సంక్షేమ ప్రభుత్వం.. మద్దతు ధర విషయంలో రైతులకు భరోసా ఇస్తున్నాం..
-ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి

అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో ఏప్రిల్ 16 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించడం జరిగిందని, ఐతే మే 1 నుంచి అకాల వర్షాలు కారణంగా కొన్ని ప్రాంతాల్లో కోసిన పంటకు తడవడం గుర్తించామని కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం ఉదయం అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు, అనపర్తి మండలాల్లో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి తో కలిసి కలెక్టర్ క్షేత్ర స్థాయి లో పర్యటించారు.

పర్యటన సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత మాట్లాడుతూ, క్షేత్ర స్థాయి పర్యటనలో రెండు అంశాలను గుర్తించామని, ఇప్పటికే 75 శాతం కోతలు పూర్తయ్యాయని మరో 25 శాతం మాత్రమే కోయాల్సి ఉందని కోతలు కోయవలసి ఉందన్నారు. ఇప్పటికే కోసి పనల మీదు ఉన్నపంట దాన్యాన్ని వేగవంతంగా తీసుకోవడం జరుగుతుందని కలెక్టరు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను రైతులకు వివరించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు ప్రతి గింజ రైతు నుంచి కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందన్నారు. ఇప్పటికే ధాన్యం కోతలు కోసిన రైతులు వర్షం తగ్గినందున అరుబయట ధాన్యం అరబెట్టు కుంటున్నారని , వెంటనే వారి ధాన్యం మిల్లులకు తరలించాలని సూచించడం జరిగిందన్నారు. అందుకు అవసరమైన గన్ని బ్యాగులు, రవాణా తదితర ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జిల్లాలో సుమారు 55 వేల హెక్టార్ల లో ధాన్యం పంట వెయ్యడం జరిగిందని, వీటిలో 75 శాతం కోతలు పూర్తి అయ్యాయని కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఇప్పటి వరకూ సుమారు లక్షా 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇంకా రైతుల వద్ద లక్షా 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కోతలు కోసి సిద్దంగా ఉన్నాయని, వాటిని యుద్ద ప్రాతిపదికన రానున్న మూడు రోజుల్లో కొనుగోలుకు చర్యలు తీసుకుంటు న్నామని మాధవీలత తెలియచేశారు. మే ఒకటి నుంచి కురిసిన వర్షాల కారణంగా కోతలు కొయ్యవద్దని రైతులను కోరడం జరిగిందని, ప్రస్తుతం వర్షాలు తగ్గిన దృష్ట్యా, రానున్న రెండు రోజుల్లో భూమి లో ఆరుతడి తగ్గి కోతకు అనువుగా ఉండే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా రైతులు మిగిలిన చోట్ల కోతలు ప్రారంభించాలని కోరడం జరుగుతోందన్నారు. అనపర్తి, బిక్కవోలు ప్రాంతాల్లో బోండా రకం ప్యాడి వేశారని, వాటికి బహిరంగ మార్కెట్ లో తక్కువ ధర ఉన్న దృష్ట్యా మద్దతు ధర కొనుగోలు చెయ్యాలని స్థానిక శాసన సభ్యులు కోరడం జరిగిందన్నారు. ఆమేరకు ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగిందని రేపటి నుంచి వాటిని కొనుగోలు చేపడుతున్నట్లు రైతులకు తెలియ చేశాం అన్నారు.

అనపర్తి శాసన సభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, రైతు పక్షపాత ప్రభుత్వం గా రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంత రైతులు బోండా రకం సాగు చేసిన దృష్ట్యా, మార్కెట్ లో అతి తక్కువ ధర ఉండి, రైతులు నష్ట పోతున్నారని అన్నారు. ఇక్కడి రైతుల విజ్ఞప్తి మేరకు బోండా రకం ప్యాడి కొనుగోలుకు ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ పర్యటన లో అనపర్తి మార్కెట్ యార్టు చైర్మన్ సబ్బళ్ళి కృష్ణారెడ్డి, రెడ్డి కార్పోరేషన్ డైరెక్టరు సత్తి రామకృష్ణారెడ్డి(రాంబాబు), కొప్పవరం సర్పంచ్ కర్రి బులి మోహన్ రెడ్డి స్థానిక నాయకులు కొవ్వూరి సత్యనారయణ రెడ్డి స్థానిక రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *