Breaking News

లక్ష్మి గణపతి సకల జనులకు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలను కలగ జేయాలి…

-జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీ రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తాడేపల్లి విజయవాడ క్లబ్ రోడ్ లో రివర్ గౌతమి రివర్ బ్రీజ్ అపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకలను ఆదివారంఎన్ టి ఆర్ జిల్లా కలెక్టర్ యస్ ఢిల్లీ రావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక ప్రాంతాల వారు ఉద్యోగ వ్యాపార రీత్యా అపార్ట్మెంట్ లో నివాస ముంటారన్నారు .కుల మతాలకు అతీతంగా సమిష్టి గా పండుగలను జరుపుకోవడం ఐకమత్యాన్ని నిదర్శనం అన్నారు .దైనందిన జీవితంలో నిత్యం ఎంతో కొంత మానసిక ఒత్తిడి కి గురి అవుతారన్నారు. యిటువంటి సామాజిక ఆత్యాద్మిక కార్య క్రమాల లో పాల్గొంటాం ద్వారా ఆనందాన్ని పొందగలుగుతారన్నారు. విశ్వ సృష్టికి అధినాయకుడు విఘ్నాలు తొలగించే విగ్ననాధుని దీవెనలతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం ఐశ్వర్యం సౌభాగ్యం అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని ప్రార్ధించారు విద్యా ఉద్యోగ వ్యాపార వాణిజ్య రాగాలలో ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయాలు సాధించేలా ఆశీస్సులు అందజేయమని లక్ష్మి గణపతి ని ప్రార్ధిస్తున్నానని తెలిపారు.  ప్రత్యేకంగా అలంకించిన మంటపం లో ఏర్పాటు చేసిన వినాయకునికి జిల్లా కలెక్టర్ పట్టు వస్త్రం సమర్పించి బెంగుళూరు వంకాయల కాప్సికం లతో తయారుచేసిన దండలను సమర్పించారు . అనంతరం లక్ష్మి గణపతి హోమం ను నిర్వహించి అత్యంత వైభవం గా ఊరేగింపు నిర్వహించి గణేష్ నిమజ్జనం నిర్వహించారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ సభులు కె.సుధాకరరావు, వెంకటేశ్వర రావు, వి వి ప్రసాద్, అడుసుమిల్లి కృష్ణ ప్రసాద్, ఉయ్యూరు కోటేశ్వరరావు, రామ్ మోహన్, బి ఎ నాగు సుదర్శన్ రెడ్డి, ఎం రామారావు, ఎం మ మణీకుమర్, చలసాని సతీష్, ఎం.మధు బాబు, అట్లూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *