Breaking News

కులగణన పై పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం

-మేధావి వర్గం , కుల సంఘాల నేతలు విలువైన సూచనలు అందచేయ్యాలి
-రేపటి లోగా ఆర్డీవో లకు పేర్లు ఇవ్వాలి
-తూ.గో. జిల్లా కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉభయ గోదావరి జిల్లాల  మేధావి వర్గం, కుల సంఘాల నాయకులు తో రాజమహేంద్రవరం లో కులగణన పై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు ప్రాంతీయ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.

మంగళవారం స్థానిక ఆనం కళా కేంద్రం లో విలేఖరులతో కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నవంబర్ 17 వ తేదీ శుక్రవారం రాజమహేంద్రవరం లో నిర్వహిస్తున్న కుల గణన కు సంబందించిన  ఆసక్తి ఉన్న మేధావి వర్గం, కుల సంఘాల ప్రతినిధులు నుంచి విలువైన సూచనలు సలహాలు, ప్రతిపాదనలు కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆ క్రమంలో ఆసక్తి కలిగిన వారు నవంబర్ 15 బుధవారం లోగా సంబంధిత ఆర్డీవో లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన కులగణన సర్వే సహేతుకంగా , హేతుబద్ధతతో చేపట్టడానికి మరింత మెరుగ్గా సెన్సస్ నిర్వహించడం కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశం స్థానిక హోటల్ మంజీరా నందు నవంబర్ 17 మ.3 గంటలకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్డీవో లకు వొచ్చిన దరఖాస్తులను పరిశీలించి, స్క్రూటిని అనంతరం వాటిని పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతుందనీ మాధవీలత పేర్కొన్నారు. తదుపరి రౌండ్ టేబుల్ సమావేశం లో వాటిపై చర్చించనున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *