-రాష్ట్రంలో రైతు బాంధవుడుగా సర్ ఆర్ధర్ కాటన్ తర్వాత డా. వైయస్ నేడు ఆ స్థాయిలో సీఎం జగన్ నిలిచారు.
-ప్రకృతి విపత్తులు ఏర్పడితే పంట నష్టపరిహారాన్ని అదే సీజన్లో ప్రభుత్వం రైతుకు అందిస్తుంది.
-సాయిల్ టెస్టింగ్ విధానం ద్వారా ఆయా భూములకు అనువైన పంటలను వేసే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
-మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగంలో విప్లవాత్మమైన మార్పులను తీసుకుని వొచ్చి రైతు పక్షన నిలుస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు.
శనివారం కొవ్వూరు డా.వై.యస్.ఆర్. హెచ్.యు – ఉద్యాన పరిశోధన స్థానం, కొవ్వూరు నందు డా.వై.యస్.ఆర్. హెచ్.యు. అరటి పరిశోధనా కేంద్రం లో అరటి సవత్సరం 2023-24 ముగింపు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశీయంగా 42 సంస్థలలో అరటి రకాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అరటి సాగులో మరింత మెరుగైన ఉత్పత్తికి అయ్యే దిశలో ఐ సి ఆర్ ద్వారా అవగాహన ఒప్పదం చేసుకున్నట్లు తెలిపారు. దశల వారీగా అరటి పండ్ల రకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. 2023-24 అరటి సాగు ప్రోత్సాహ సంవత్సరం గా నిర్ణయం జరిగిందన్నారు. అరటి పండు, ఆకులు, కాండము, పిలకలు ప్రతి ఒక్కటి ఎంతో ఉపయోగ పడతాయన్నారు. రైతుల పక్షాన బీమా పథకం వాయిదా చెల్లించడం ద్వారా, కేంద్రం అమలు చేస్తున్న పసల్ బీమా పథకం నియమ నిబంధనలు కాదని, రైతుల పక్షాన నిలబడే దిశలో రాష్ట్రంలో అన్ని పంటలకు కూడా బీమా పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. నేడు కేంద్రం కూడా దిగివచ్చి పసల్ బీమా పథకం లో రాష్ట్రంలో అమలు జరుపుతున్న విధానంలో మార్పులు చేసినట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో రైతు బంధవుడుగా సర్ ఆర్ధర్ కాటన్ కాగా మరొకరు డా వైయస్ రాజశేఖరరెడ్డి అన్నారు. నేడు అదే కోవలో జగన్ మోహన్ రెడ్డి నిలవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీ ఉప కులపతి డా టి. జానకీరామ్ సేవలను గుర్తించి మరో ఏడాది పొడిగించడం జరిగిందన్నారు.
భూమి సారావంతాన్ని బట్టి అందుకు సంబంధించిన పంటలు వేసే దిశగా సాయిల్ టెస్టింగుకు అధిక ప్రాధాన్యతని ఇస్తున్నా మన్నారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో ఆర్భికే లు ఏర్పాటు చేసి రైతు ఇంటి వద్దకే నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందించడం జరుగుతోం దన్నారు. పండిన ఉత్పత్తులను నిలువ ఉంచుకొని , మంచి ధర వచ్చినప్పుడు రైతులు మార్కెట్లో విక్రయించుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. గ్రామ , మండలం, జిల్లాస్థాయిలో అగ్రి అడ్వైజర్ బోర్డు కమిటీలు ఏర్పాటు చేసి రైతులను అవగాహన కల్పించడంతోపాటు వారికి అండగా నిలుస్తున్నా మన్నారు. ప్రకృతి విపత్తుల వలన పంట నష్టపోయిన రైతాంగానికి అదే సీజన్లో పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తోం దన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించే విధంగా తిరుపతిలో డాక్టర్ వైయస్సార్ హార్టికల్చర్ కేంద్రం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యం పుష్పాలు అందిస్తుంటే , ఆ పుష్పాలనే ప్రసాదంగా భక్తులకు, ప్రముఖ వ్యక్తులకు చిత్రపటాలుగా తీర్చి దిద్ది బహుమతిగా అందజేయడం జరుగుతొందని పేర్కొన్నారు. తద్వారా హార్టికల్చర్ శాఖకు గుర్తింపు పొందడం జరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు
ఉప కులపతి టి. జానకి రామ్ మాట్లాడుతూ అరటి సాగులో సేంద్రియ విధానంలో రైతులను ప్రోత్సహిస్తున్నాం అన్నారు. రైతులకు టిష్యూ కల్చర్ అరటి మొక్కలను 13 లక్షలకు పైగా రైతులకు అందించామన్నారు. రైతులకు అరటి సాగు పై ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు అందిస్తున్నామన్నారు. 2023..24 సంవత్సరం లో రాష్ట్రంలోని 42 పరిశోధన కేంద్రాల ద్వారా జాతీయ స్థాయిలో అరటి రైతులకు అవగాహనా కల్పిస్తున్నామన్నారు. గణనీయమైన దిగుబడి సాధించే దిశగా డ్రోన్స్ వినియోగాన్ని కేత్ర స్థాయిలో రైతులకు అవహగాన కల్పించామన్నారు. 130 దేశాల్లో అరటి సాగు ఉందని, 150 మిలియన్ టన్నుల అరటి పండ్లు, కూర రకాల ఉత్పత్తులు జరుగుతున్నాయన్నారు. అరటి విస్తీర్ణం గణ నీయంగా పెరిగిందన్నారు. దేశంలో 22.5 శాతం మేర అరటి సాగులో ఉందన్నారు. రైతులకు బిందు సేద్యం, ఎరువులు, పురుగు మందులు, యాజమాన్యం పద్ధతులు సమగ్ర పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అరటి పరిశోధన, హార్టికల్చర్ సాగు విస్తీర్ణం కోసం పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నట్లు, గత 4 ఏళ్ల లో విస్తృత స్థాయి లో గణనీయమైన అభివృద్ధి కి దోహదం చేశాయని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భముగా జిల్లా అగ్రి బోర్డు చైర్మన్ బూరుగుపూడి సుబ్బారావును పలువురు శాస్త్రవేత్తలను సన్మానించగా వారిలో డి మాధవరావు, డాక్టర్ జై కృష్ణ ప్రసాద్, డాక్టర్ బి వి కే భగవాన్, డాక్టర్ ఎం శాంతిరాజు, డాక్టర్ ఆర్ నాగలక్ష్మి, డాక్టర్ కే మమత, డాక్టర్ టి. రాజశేఖర్,డాక్టర్ ఎం ముత్యాల నాయుడు, డాక్టర్ దొరజీరావు డాక్టర్ ప్రభాకర్ రావు సన్మానించారు.
ఈ సందర్భంగా తొలుత అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసిన అరటి కంద పెండ్లం ఉత్పత్తుల ఎగ్జిబిషన్ మంత్రి ప్రారంభించి తిలకించారు.
ఈ కార్యక్రమంలో కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, అరటి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా. బి. రామానందం,డా. వై. యస్. ఆర్. ఉద్యాన విశ్వ విద్యాలయం పాలక మండలి సభ్యులు :
డీన్ ఆఫ్ హర్టీకల్చర్ డా. ఎ. పద్మావతమ్మ,
అసోసియేట్ డీన్ డా. ఎమ్. మాధవి,విశ్వ విద్యాలయ అధికారులు :
డైరెక్టర్ ఆఫ్ రిసర్చ్ డా. ఎల్. నారం నాయుడు,డైరెక్టర్ ఆఫ్ ఎక్సెన్షన్ డా. ఇ. కరుణశ్రీ,రిజిస్ట్రార్ డా. బి. శ్రీనివాసులు,
కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ డా. డి. వెంకట స్వామి, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫ్ఫైర్స్ డా.డి. సలోమి సునీత తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News