విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో అడ్వాన్స్‌డ్ ఫిట్‌నెస్ & న్యూట్రీ స్పాట్ రెండవ బ్రాంచ్ ఘనంగా ప్రారంభించబడిరది. గురువారం గుణదల, మేరీమాత చర్చి ఎదురుగా అడ్వాన్స్‌డ్ ఫిట్‌నెస్ & న్యూట్రీ స్పాట్ రెండవ బ్రాంచ్‌ను వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంలో భాగమైన ఫిట్‌నెస్ సంబంధించి అన్ని ఫిట్‌నెస్ సప్లిమెంట్స్‌తోపాటు ఫిట్‌నెస్ పరికరాలు అన్ని ఒక్కచోటే నగరంలో అందుబాటులో తెచ్చిన నిర్వాహకులను అభినందించి ఇంతకు ముందు నగరంలో మొదట ప్రారంభించిన బ్రాంచ్ ఎంతో ఆదరాభిమానాలు పొందిందని అలాగే రెండవ బ్రాంచ్ మరింత ఆదరాభిమానాలతో మరిన్ని బ్రాంచీలు విస్తరించాలని శుభాకాంక్షలు తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ పి.వెంకటేష్ మాట్లాడుతూ ఈ రంగంలో సుమారు 15 సంవత్సరాల నుండి వ్యాపారం నిర్వహిస్తున్నామన్నారు. గతంలో ఫిట్‌నెస్ సప్లిమెంట్స్ కావాలంటే ఆన్‌లైన్‌లోగానీ మెట్రోపాలిటన్ సిటీలలో మాత్రమే లభించేవని దానిని దృష్టిలో వుంచుకుని నగరంలోని మొదటి బ్రాంచ్‌ను మాచవరంలో ప్రారంభించామని కస్టమర్ దేవుళ్ళ ఆశీస్సులతో అందుబాటు ధరలో, మంచి క్వాలిటీతో గ్యారంటీ ఐటమ్స్‌ను అందజేసి ఆరోగ్య విషయంలో జాగ్రత్తపడే అన్ని వర్గాల కస్టమర్లకు మా మీద నమ్మకం ఏర్పరుచుకున్నామని ఆ నమ్మకంతోనే మరింత ముందడుగు వేసి రెండవ బ్రాంచ్‌ను గుణదలలో ప్రారంభించామన్నారు. ఈ బ్రాంచ్‌లో ఫిట్‌నెస్ సప్లిమెంట్స్‌తోపాటు ఫిట్‌నెస్ పరికరాలు ఆల్ ఇన్‌వన్…వన్ రూఫ్ అనే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. మా వద్ద హెల్త్ అండ్ ఫిట్‌నెస్ సప్లిమెంట్స్, ఆప్టిమమ్ న్యూట్రిషియన్, డైమటేజ్ న్యూట్రిషియన్, ఆల్టిమేట్ న్యూట్రిషియన్ మరియు ఇండియన్ బ్రాండ్స్, ప్రోటీన్, మాస్‌గైనర్, ఐసోలెట్ వెయ్ ప్రోటీన్, బకా, వెల్‌నెస్ ప్రోడక్ట్స్, ఫిట్‌నెస్ పరికరాలు ఎయిరోఫిట్, నేషనల్ బాడీలైన్, హోమ్ జిమ్, జిమ్ సెటప్, ఫిట్‌నెస్ పరికరాలు, ఆర్టిఫిషియల్ గ్రాస్, మూమెంట్స్, షీల్డ్స్, మెడల్స్ తదితర ఐటమ్స్ లభ్యమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంకా భాస్కర్, 25వ డివిజన్, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, డోగిపర్తి రమేష్‌బాబు, స్వస్తిక్ ఫార్మాస్యూటికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, మేడికొండ సతీష్‌చంద్ర, సౌత్ ఇండియా సేల్స్ మేనేజర్ ప్యూరోబియన్ న్యూట్రిషియన్, కస్టమర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News