Breaking News

గుంటూరు సిటీ లీగల్ సెల్ ఛైర్మన్ గా తుమ్మలపెంట వెంకట కృష్ణ నియామకం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నందు గురువారం ఎపిసిసి లీగల్ సెల్ చైర్మన్ డాక్టర్ శాస్త్రి జంధ్యాల, ఎపిసిసి వైస్ ప్రెసిడెంట్ వి.గురునాధం, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.నరసింహారావు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు తాంతియా కుమారిల  చేతుల మీదుగా గుంటూరు సిటీ లీగల్ సెల్ ఛైర్మన్ గా తుమ్మలపెంట వెంకట కృష్ణను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతనంగా నియామకం అయిన వెంకట కృష్ణ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఈ పదవిని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానని కాంగ్రెస్ పార్టీకి లీగల్ సెల్ కి బలోపేతానికి ఎనలేని కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా లీగల్ సెల్ చైర్మన్ సుధీర్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సందీప్, స్టేట్ లీగల్ సెల్ రాష్ట్ర సెక్రటరీ వరప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ రత్నాకర్, ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్, ఏపీసీసీ మీడియా స్టేట్ కో-ఆర్డినేటర్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *