Breaking News

జనవరి 22 న ఓటరు తుది జాబితా ప్రకటన కోసం సంసిద్ధం గా ఉన్నాం

– జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం ఉదయం కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులతో పలు ఎజెండా అంశాలపై దిశా నిర్దేశనం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. మాధవీలత , ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఓటరు జాబితా సంబంధించి మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించి వొచ్చిన దరఖాస్తులను ఎన్నికల సంఘం మార్గదర్శకా లకు అనుగుణంగా పరిష్కరించడం జరిగిందన్నారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 మేరకు తుది ఓటరు జాబితా రూపకల్పన మరియు ఖచ్చితత్వం కోసం తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఆమేరకు సంబంధిత నియోజక వర్గ ఓటరు నమోదు అధికారులు దిశా నిర్దేశనం చేశామన్నారు. ది 21.01.2024 నాటికి తుది ఓటర్ల జాబితాలను సిద్దం చేసి నివేదిక అందచేసి, జనవరి 22 న తుది జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. మార్పులు, చేర్పులలో భాగంగా ఫోటో సారూప్య ఎంట్రీలు మరియు డెమోగ్రాఫికల్ సారూప్య ఎంట్రీలు, చనిపోయిన, నకిలీ, మార్చబడిన ఓటర్ల తొలగింపు మరియు తార్కిక లోపాలు / క్రమరాహిత్యాల సవరణ మొదలైన వాటిపై ధృవీకరణ చెయ్యడం జరిగిందన్నారు. జనవరి 22 న ఓటరు జాబితా ప్రకటన తదుపరి జిల్లా ఎన్నికల అధికారి, నియోజక వర్గ ఎన్నికల అధికారి, పోలింగ్ బూత్ ల వద్ద ఆయా జాబితాను ప్రకటించడం జరుగుతుందని అన్నారు.

ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడం కోసం పోలింగ్ కేంద్రాలలో తగిన కనీస వసతులు అందుబాటులో ఉంచడం పోలింగ్ సిబ్బందిగా నియామకం కోసం ఉద్యోగుల డేటాబేస్ తయారీ చేపట్టడం జరుగుతున్నట్లు తెలియ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు 25.01.2024న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలియ చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులకు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఇతర అనుబంధ అధికారులకు శిక్షణ కోసం తగిన సమావేశ మందిరాలను గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, కొవ్వూరు సబ్ కలెక్టర్ ఆసుతోష్ శ్రీవత్సవ్, డి ఆర్వో జి. నరసింహులు, నియోజక వర్గ ఎన్నికల అధికారులు  రాజానగరం  – ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి,  అనపర్తి –  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (గెయిల్ (ఐ) లిమిటెడ్) ఏబీవీఎస్బి శ్రీనివాస్, నిడదవోలు – స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పి ఐ పి ఆర్ ఎమ్ సి యూనిట్-I, కొవ్వూరు ఎమ్ . ఝాన్సీ రాణి, రాజమండ్రి (రూరల్) ఎస్.డి.సి.,  ఎస్. సరళా వందనం, గోపాలపురం – ఓఎన్జీసి ఎస్.డి.సి.,  ఎమ్. వెంకట సుధాకర్, కెఆర్ఆర్సి ఎస్డిటి పార్లమెంట్ నియోజకవర్గ ఏ ఈ ఆర్ ఓ –  కృష్ణ నాయక్, కలెక్టరేట్ ఎన్నికల సిబ్బంది తదితరులు  హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *