Breaking News

ధవలేశ్వరం లూధరన్ చర్చి దర్శించి ప్రార్థనలు చేసిన మంత్రి వేణుగోపాలకృష్ణ

రాజమండ్రి రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతి కొరకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఎటువంటి విఘాతం  లేకుండా  నిర్విఘ్నంగా కొనసాగించేలా దేవదేవుడైన యేసుక్రీస్తు ఆయనకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకోవడం జరిగిందని జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం  సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.

ఆదివారం స్థానిక ధవలేశ్వరం మెయిన్ రోడ్డు లో ఉన్న లూధరన్ చర్చ్ ని మంత్రి వేణుగోపాలకృష్ణ సందర్శించి ఏసుక్రీస్తుకు ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజాసేవ పరమావధిగా  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  వాలంటరీ వ్యవస్థను  ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాల లబ్ధిని నేరుగా పేద ప్రజల ఇంటి వద్దకే అందిస్తూ  వారి ఆర్థిక అభివృద్ధిని కాంక్షిస్తున్నారన్నారు. పాలకుడిగా కాకుండా ప్రజా సేవకుడిని మాత్రమే సీఎం జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. వారి అడుగుజాడల్లోనే ప్రజా సేవే లక్ష్యంగా పేద ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ప్రజాసేవ చేయాలని లక్ష్యంతో వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులకు ఇంటి వద్దకే శరవేగంగా అందిస్తున్న నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేందుకు అని రాజోలు ప్రాంతంలో జడ్పిటిసి గా ఉన్న నేను తదుపరి జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసి అనంతరం కాకినాడ రూరల్, రామచంద్రపురం లో శాసనసభ్యులుగా పోటీ చేసిన నేను నేడు మంత్రిగా ప్రజా సేవలో తన వంతు బాధ్యతలు నిర్వహిస్తునన్నారు. నేడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.. నేను పాలకుడును కాదని సేవకులను మాత్రమే ప్రజాసేవ తన కర్తవ్యం అని మంత్రి గోపాలకృష్ణ అన్నారు .

పేదరికంలో ఉన్న పేదవారికి రక్షణ దేవుడిని , నేడు మనిషి రూపంలో సహాయం చేస్తున్న దైవమే సీఎం జగన్ మోహన్ రెడ్డి అని నేను విశ్వసిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. నా తండ్రి వైయస్సార్ రు. 2.5 లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు ఖరీదైన వైద్యం, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తే తండ్రి కి తగ్గ తనని అడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ ని రు. 25 లక్షలకు పెంచి, కాదు విద్యార్థుల ఉన్నత విద్య లక్ష్యంగా విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో మెరుగైన పారిశుధ్య నిర్వహణ కొరకు రు.3.10కోట్లతో పలు డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *