Breaking News

ఈ వి ఎమ్, అనుబంధ యూనిట్స్ తరలింపు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఈ వి ఎమ్ లు, ఇతర అనుబంధ బ్యాలెట్ యూనిట్స్ భద్ర పరుచుటకు సిద్దం చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లకు జిల్లా స్ట్రాంగ్ రూమ్ గోడౌన్ నుంచి తరలించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత తెలియ చేశారు. గురువారం రాత్రి జిల్లా పరిధిలోనీ ఏడు నియోజక వర్గాల కు చెందిన ఈ వి ఎమ్, అనుబంధ యూనిట్స్ తరలింపు ప్రక్రియని వ్యక్తిగతంగా మాధవీలత పర్యవేక్షించారు.

తొలి రోజు రాండమైజేషన్ పూర్తి చేసిన తరువాత తొలిరోజు పార్లమెంటు నియోజక వర్గాలకు కేటాయించిన బ్యాలెట్ యూనిట్స్ కంట్రోల్ యూనిట్స్ వివి ప్యాట్స్ లని ఆయా నియోజక వర్గాల స్ధాయిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లకు తరలింపు ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు.

నియోజక వర్గాలు వారీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ల వివరాలు
40 – అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం – శ్రీ రామారెడ్డి జెడ్.పి.పి. బాయ్స్ హై స్కూల్, అనపర్తి
49 – రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం
ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, వెలుగుబంద
50 – రాజమండ్రీ అర్బన్ నియోజకవర్గం, ఎస్ కే వి టి డిగ్రీ కళాశాల,  రాజమహేంద్రవరం,
51 – రాజమండ్రీ రూరల్ నియోజక వర్గం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్  (NAC) హాస్టల్ భవనం, కలెక్టరేట్‌, ధవళేశ్వరం
54 – కొవ్వూరు (SC) అసెంబ్లీ నియోజకవర్గం శ్రీ మావులేటి సోమరాజు సంస్కృత ఉన్నత పాఠశాల, కొవ్వూరు
55 – నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం జూనియర్ కళాశాల (బాలికలు), నిడదవోలు
66 –  గోపాలపురం (SC) అసెంబ్లీ నియోజకవర్గం డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులం (బాలికల) రెసిడెన్షియల్ పాఠశాల,  గోపాలపురం

ఈ రాండమనైజేషన్ , అనంతరం వాహనాల తరలింపు కార్యక్రమంలో   రాజమండ్రీ రూరల్ ఆర్వో జె సి – ఎన్. తేజ్ భరత్, రాజమండ్రి అర్బన్ ఆర్వో, మునిసిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్, కొవ్వూరు  ఆర్వో , సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ , డి ఆర్వో జీ. నరసింహులు, రాజానగరం ఆర్వో/ ఆర్డీఓ ఏ. చైత్ర వర్షిణి,  గోపాలపురం ఆర్వో – కె ఎల్ శివజ్యోతి,  అనపర్తి ఆర్వో ఎమ్. మాధురీ, నిడదవోలు ఆర్వో ఆర్.వి.రమణా నాయక్ , రాజమండ్రీ పార్లమెంటు సహయ రిటర్నింగ్ అధికారి – ఎస్.డి.సి. ఆర్.కృష్ణా నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎమ్. భాను ప్రకాష్, పి. సువర్ణ, రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *