Breaking News

మద్యం అక్రమ నిల్వలు, అమ్మకాల ఉల్లంఘనలపై 9177119097, 9492630970 జిల్లా ఎక్సైజ్ కంట్రోల్ రూం నంబర్ల కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయండి

-మద్యం అక్రమ రవాణా, నిల్వ, అమ్మకాలు జరగకుండా అధికారుల పర్యవేక్షణ ఉండాలి:కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, సెబ్ అధికారులతో మద్యం అక్రమ నిల్వలు, అమ్మకాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ మద్యం అక్రమంగా రవాణా, నిల్వ, అమ్మకాలు జరగకుండా అధికారుల పర్యవేక్షణ ఉండాలని, ఎట్టి పరిస్థితిలోనూ ఉల్లంఘనలు ఉండరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, సెబ్ అధికారులతో మద్యం అక్రమ నిల్వలు, అమ్మకాలపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ జిల్లాలోని డిస్టిల్లరీ, ఔట్లెట్ లలో సిసి కెమెరాల పర్యవేక్షణ ఉండాలని, అక్కడ నుండి మద్యం రవాణా వాహనాలకు జిపిఎస్ ఏర్పాటు ఉండాలని సూచించారు. జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి జానకి రాములు వివరిస్తూ జిల్లాలోని తిరుపతి, ఓజిలి డిపోల నుండి 24 వాహనాల ద్వారా రవాణా చేస్తున్నామని వాటికి జిపిఎస్ ఏర్పాటు ఉన్నాయని, డిస్టిలరీలలో సిసిటివి ఏర్పాటు చేయడం జరిగిందనీ జిల్లా కేంద్రంలోనూ, సిఈఓ, డిఈఓ ల కార్యాలయంలో పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. జిల్లాలోని మురికివాడల్లో మరియు రహదారికి దూరంగా ఉండి మద్యం అక్రమ నిల్వలు, రవాణాకు అవకాశాలు ఉండే సెన్సిటివ్ ప్రాంతాలుగా 21 గుర్తించామని తెలిపారు. ప్రభుత్వ మద్యం ఔట్లెట్ లలోని సేల్స్ ఉద్యోగులు, సూపర్వైజర్లు కలిపి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల మేరకు 15 మందిని తొలగించడం జరిగిందనీ తెలిపారు. గత సంవత్సరం మద్యం అమ్మకాలు పరిగణనలోకి తీసుకుని, ఇప్పుడు 30 శాతానికి మించకుండా మద్యం అమ్మకాలు ఉండేలా, ప్రతి రోజూ ఉదయం ఓపెనింగ్ స్టాక్ 50 శాతం మించకుండా ఉండేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

మద్యం అక్రమ నిల్వలు, అమ్మకాల ఉల్లంఘనలపై 9177119097, 9492630970 జిల్లా ఎక్సైజ్ కంట్రోల్ రూం నంబర్ల కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలనీ సూచించారు

జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి రాజేంద్ర వివరిస్తూ మార్చి 16 నుండి ఏప్రిల్ 26 తేదీ వరకు 349 కేసులు బుక్ చేయడం జరిగిందని 20 వాహనాలు సీజ్ చేయబడినాయని, సీజ్ చేసిన మద్యం విలువ రూ. 29.86 లక్షలు అని తెలిపారు. 7 అంతర్ రాష్ట్ర బోర్డర్ పోలీస్ చెక్ పోస్ట్ లు, ఒక అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ తడ పోలీస్ స్టేషన్ పరిధిలో బి.వి పాలెం వద్ద ఏర్పాటు, అంతర్ రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు 2 సురుటుపల్లి, బీవీ పాలెం నందు ఏర్పాటు చేశామని తెలిపారు. 6 అంతర్ జిల్లా చెక్ పోస్టులు వద్ద నిరంతర తనిఖీ చేస్తున్నారని తెలిపారు. సెబ్ అధికారులు ముందు జాగ్రత్త చర్యగా 190 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని తెలిపారు. 2019 సం. ఎన్నికలలో మద్యం 4.24 లక్షలు సీజ్ చేయడం జరిగిందనీ, ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏప్రిల్ 26 వరకు 18 లక్షలుగా ఉందని తెలిపారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *