గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికలలో పొటీ చేసే అభ్యర్ధులు తప్పని సరిగా ఎక్స్పెండీచర్ రిజిర్లు పక్కాగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ గుంటూరు తూర్పు, పశ్చిమ, తాడికొండ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు వినోద్ కుమార్ చంద్రవన్ తెలిపారు. బుధవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గుంటూరు తూర్పు మరియు పశ్చిమ రిటర్నింగ్ అధికారులు కీర్తి చేకూరి, కె. రాజ్యలక్ష్మి లతో కలిసి పోటీలో ఉన్న అభ్యర్ధులకు ఎన్నికల వ్యయ విధానం పై వివరించి, అభ్యర్ధుల వ్యయ రిజిస్టర్లను పరిశీలించారు.
Prajavartha Online Telugu News