Breaking News

గోదావరి జిల్లా కలెక్టర్ గా పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడానికీ రాజమహేంద్రవరం కు చేరుకున్న పి. ప్రశాంతి ని స్థానిక రెవిన్యూ అతిథి గృహంలో శుక్రవారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ స్వాగతం పలికారు. కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్న పి..ప్రశాంతి కి స్వాగతం పలికిన వారిలో కొవ్వూరు డివిజన్ సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవిన్యూ అధికారి జి నరసింహులు, రాజమండ్రి డివిజన్ రెవిన్యూ డివిజన్ అధికారి ఏ. చైత్ర వర్షిణి తదితరులు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ మార్కెటింగు శాఖ సంచాలకులు గా వ్యవహరిస్తున్న పి. ప్రశాంతి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *