Breaking News

ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్….. డా. జి. సృజన

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ తనిఖీలలో భాగంగా గొల్లపూడి మార్కెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచే గోదామును బుధవారం జిల్లా కలెక్టర్‌ డా. జి.సృజన పరిశీలించారు. గోడౌన్ కు వేసిన సీల్డ్ లను, ఈవీఎంల రక్షణ భద్రత కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వివి ప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి పంపించవలసి ఉంటుందన్నారు. ఈవీఎం గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ నిర్వహించారు. తనిఖీలో డిఆర్ఓ వి. శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరిండెంట్ ఎం. దుర్గాప్రసాద్, రూరల్ తహసీల్దార్ జాహ్నవి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *