Breaking News

నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి మ్యానిఫెస్టోలో బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత కల్పించారు వాటిని వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు సత్యవాడ.దుర్గాప్రసాద్, కార్యదర్శి కోసూరు సతీష్ శర్మ ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. కూటమి అధికారంలోకి రావటానికి బ్రాహ్మణులు ముఖ్య భూమిక పోషించారన్నారు, రాబోయే నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. విజయవాడ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ అన్ని రంగాల్లో బ్రాహ్మణులు వెనుకబడిపోయారని తెలిపారు. దేవాలయ పాలక మండలి లో బ్రాహ్మణులకు పదవులు కేటాయించాలి అని కోరారు. రాజధాని అమరావతి లో రెండు ఎకరాల స్థలాన్ని అగ్రహరానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణుల పై జరుగుతున్న దాడుల్ని అరికట్టేందుకు అట్రాసిటీ లాంటి చట్టాలు తేవాలని సీఎం ని కోరారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ తో పాటు, బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్తిగా పునర్జీవనానికి కృషి చేసి కార్పొరేషన్ ఆశయ సాధనానికి కృషి చేయాలని కూడా తీర్మానం చేసుకున్నామన్నారు. గత 40 సంవత్సరాలుగా బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. రేపు దుర్గమ్మ వారికి ఆషాడ మాసం సారె కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవాసంఘ కోశాధికారి హెచ్ కే మనోహరరావు, ఉపాధ్యక్షులు రాంబాబు సురేష్ కుమార్, కార్యదర్శి సెక్రటరీ టి వెంకటేశ్వర్లు, మహిళా అధ్యక్షురాలు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *