-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం అర్థవంతంగా చూపాలని, అలసత్వం సహించేది లేదని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ వారు డిఆర్ఓ పెంచల్ కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, రామ్మోహన్, కోదండ రామిరెడ్డి తో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.
శాఖల వారీగా అర్జీల వివరాలు :
రెవెన్యూ శాఖ – 94, పోలీస్ శాఖ – 10, డి.ఎం.హెచ్.ఓ – 3, రిజిస్ట్రార్ ఎస్.వి యునివర్సిటీ -1, సివిల్ సప్లై -1, డిస్ట్రిక్ట్ వాటర్ రిసోర్స్ ఆఫీస్ -2, ఏ.పి.ఎస్.ఆర్.టి.సి -2, డి.పి.ఓ -4, సర్వ శిక్ష అభియాన్ -2, జాయింట్ కలెక్టర్ -6, పి.డి.డి.ఆర్.డి.ఏ- 3, ఎం.పి.డి.ఓ -2, కలెక్టర్ కార్యాలయం ఈ-సెక్షన్ -6,మునిసిపల్ కమిషనర్ -2, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ -2,ఎస్.ఈ పంచాయత్ రాజ్ -1, డిస్ట్రిక్ట్ కొ-ఆర్డినేటర్ మెడికల్ -1,డి.ఆర్.ఓ -1 డి.ఎస్.పి-3, వెరసి మొత్తం 146 వినతులు రావడం జరిగిందని అధికారులు అందరు సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్ కు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Prajavartha Online Telugu News