Breaking News

విజయవాడ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షన్ లో అగ్రస్థానంలో నిలుపుదాం

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో బుధవారం సాయంత్రం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలపై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ జాయింట్ సెక్రెటరీ రూప మిశ్రా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, అధికారులతో పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో స్వచ్ఛతాహి సేవ లో భాగంగా నగర పాలక సంస్థలు చేయవలసిన కార్యక్రమాలు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, స్వచ్ఛ సర్వేక్షన్ లో విజయవాడ నగరపాలక సంస్థ అగ్రస్థానంలో ఉండాలని అన్నారు. స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గుర్తించిన క్లీన్లినెస్ టార్గెట్ యూనిట్స్ (CTUs అనగా తరచుగా పరిశుభ్రం చేయవలసిన ప్రదేశాలు) త్వరితగతిన పరిశుభ్రపరచాలని, క్లీన్లినెస్ టార్గెట్ యూనిట్స్ ని మూడు విధాలుగా విభజించి, లో, మీడియం, హైగ గుర్తించి దానికి అనుగుణంగా ఒక టార్గెట్ ని ఫిక్స్ చేసుకొని అనుకున్న కాల పరిమితిలో వాటిని పరిశుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలిచ్చారు.

స్వచ్ఛత హి సేవలో భాగంగా సెల్ఫీ పాయింట్స్ ని పెట్టి ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు, స్వభావం స్వచ్ఛత, సంస్కారం స్వచ్ఛత తో సెల్ఫీ పాయింట్స్ ఉండాలని అధికారులను ఆదేశించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతోపాటు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నవలళి, స్వచ్ఛ సర్వేక్షన్ టీం పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *