Breaking News

Daily Archives: March 24, 2025

దర్గా ప్రాంతంలో డ్రెయినేజీ సమస్య పరిష్కరిస్తాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురం 40 వ డివిజన్ దర్గా ప్రాంతంలోని డ్రెయినేజీలు , కలుషిత తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన , అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం 40,41 డివిజన్ల లో పర్యటించారు. దర్గా ప్రాంతంలో డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహిస్తూ దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని మంచినీటి పైపులు లీకై తాగునీరు కలుషితం అవుతుందని అలాగే డ్రైనేజీ కాలువ నిర్మాణం చేపట్టాలని …

Read More »

సీఎం సహాయ నిధి పేదలకు భరోసా

-టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు భరోసా కల్పిస్తుందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ అన్నారు. చిట్టినగర్ కు చెందిన అబ్దుల్ వసీం గుండెపోటు కు గురై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆర్థిక ఇబ్బందుల వలన సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకోగా రూ 1,19,561 మంజూరయ్యాయి. ఆ చెక్కును సోమవారం బాధితునికి అందజేశారు. వించిపేటలోని వారి కార్యాలయంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి …

Read More »

బ్యూటీషియన్ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం, కుట్టు మిషన్ల పంపిణీ మరియు ట్యాలీ సర్టిఫికెట్ల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : HCL ఫౌండేషన్ మద్దతుతో వాసవ్య మహిళా మండలి 24 మార్చి 2025న బ్యూటీషియన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి, కుట్టు యంత్రాలను పంపిణీ చేసి, టాలీ శిక్షణార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. డాక్టర్ బి కీర్తి అధ్యక్షురాలు వాసవ్య మహిళా మండలి, కొనసాగుతున్న టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ మరియు టాలీ శిక్షణల గురించి మాట్లాడారు. మహిళా సాధికారత మరియు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి అన్ని శిక్షణలు ఉచితంగా ఇస్తున్నాము అని అన్నారు. డాక్టర్ దీక్ష వాసవ్య మహిళా మండలిలో …

Read More »

ప్రభుత్వం ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్ సేవల వినియోగించుకోవాలి

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలోని ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఈరోజు అనంతపురం జిల్లా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ 30వ వార్షికోత్సవ మహాసభ అనంతపురంలో జరిగింది. ఈ సభలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ ఏపీలో దాదాపు 30 వేల మంది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏపీఎంపీల సేవలు ప్రజలకు …

Read More »

ఎక్కువ మొత్తంలో పన్ను బకాయిలు ఉన్న వారి పై చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఎక్కువ మొత్తంలో ఉన్న పన్ను బకాయిల అసెస్మెంట్ లపై చర్యలు తీసుకున్నారు విఎంసి రెవెన్యూ సిబ్బంది. అందులో భాగంగా సత్యనారాయణపురం, గవర్నర్పేట, సీతన్నపేట ప్రాంతాలలో గల ఎక్కువ కాలంగా భారీ మొత్తంలో బకాయిలు ఉన్న షాపులకు తాళం వేశారు రెవెన్యూ సిబ్బంది. పన్ను బకాయలు మొత్తం తిరిగి చెల్లించిన తర్వాతే వారి సేవలను వారు కొనసాగించవచ్చని వారికి తెలియజేశారు. నగరంలోని ప్రజలందరూ మార్చ్ …

Read More »

రెస్టారెంట్లలో అగ్నిమాపక నిరోధ పరికరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన విఎంసి ఫైర్ సిబ్బంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి గురువారం బెంజ్ సర్కిల్ దగ్గర platform-65 (Train restaurant) లో ఫైర్ ఆక్సిడెంట్ జరిగిన కారణంగా సోమవారం RR దర్బార్, రాజాదర్బార్,సదరన్ స్పైస్ మరియు కడియపట్టణం రెస్టారెంట్స్ మరియు హోటల్స్ ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను …

Read More »

ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు, వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంపై అధికారులకు సూచనలు ఇచ్చారు. పౌరుల అవసరాలు, నగరాభివృద్ధి …

Read More »

ఉగాది రోజున లబ్ధిదారుల చేతికి తాళాలు… : మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగర పరిధిలోని 432 మంది టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఉగాది రోజున వారి చేతికి తాళాలు అందిస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం మంత్రి మచిలీపట్నం నగర పరిధిలోని గోసంఘంలోని టిడ్కో గృహ సముదాయాలను సందర్శించారు. గోసంఘం టిడ్కో గృహ సముదాయాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ …

Read More »

అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రత్యేక శ్రద్ధ వహించి సానుకూలంగా పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రత్యేక శ్రద్ధ వహించి సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డి ఆర్ ఓ కే చంద్రశేఖర రావు, కేఆర్ఆర్సి ఎస్డిసి శ్రీదేవిలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక– మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల …

Read More »

ఈనెల 28న అవనిగడ్డ లో జాబ్ మేళా…

-డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డి.కె. బాలాజీ, ఐఏఎస్  మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.28.03.2025 శుక్రవారం అవనిగడ్డ లోని “ప్రభుత్వ డిగ్రీ కళాశాల” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డి.కె. బాలాజీ, ఐఏఎస్ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో, ముత్తూట్ మనీ లిమిటెడ్, కెఎల్ గ్రూప్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ …

Read More »