Breaking News

Daily Archives: April 9, 2025

కృష్ణుడుపాలెం కాలనీ లో కలెక్టర్ పర్యటన

-ప్రత్యేక గ్రామ పంచాయతీ కోసం తీర్మానం చెయ్యాలి .. ప్రభుత్వానికి సిఫార్సు చెయ్యడం జరుగుతుంది -రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇక్కడికి బదలీ చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గోకవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల కోసం గోకవరం మండలం పరిధిలో బుధవారం సాయంత్రం అధికారులతో కలిసి పర్యటించి కృష్ణుడుపాలెం కాలనీ వాసుల సమస్యలు తెలుసుకోవడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. దేవీపట్నం మండలం పరిధిలో 18 గ్రామాలకి చెందిన …

Read More »

ఎలుకలు నివారణ శాస్త్రీయ పద్ధతిలో చేయడం వలన వీటి సమస్యను గణనీయంగా తగ్గించవచ్చు.

-వ్యవసాయ కళాశాల డీన్ డా. శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు ఎలుకలు నివారణ శాస్త్రీయ పద్ధతిలో చేయడం వలన వీటి సమస్యను గణనీయంగా తగ్గించవచ్చని  వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా. శ్రీనివాస్ అన్నారు. ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో గల వ్యవసాయ కళాశాల, రాజమహేంద్రవరం విద్యార్థులు RAWEP ప్రోగ్రామ్ లో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించే జాతీయ సేవా పథకం ప్రత్యేక కార్యక్రమం కోరుకొండ మండలం, శ్రీరంగ పట్నం గ్రామం లో జరుగుతుంది.  ఇందులో …

Read More »

బాల్య వివాహాలు నిరోధించడం సామాజిక బాధ్యత

-1800 425 4156, 1098 , 1091 సమాచారం అందించండి -డీఆర్వో సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బాల్య వివాహాలు నిరోధించడానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, బాల్య వివాహాలు నిరోధించడం సామాజిక బాధ్యత అని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి పేర్కొన్నారు. బుధవారం అమరావతి నుంచి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ సంచాలకులు ఎమ్. వేణుగోపాల్ రెడ్డి బాల్య వివాహ నిరోధక కార్యాచరణ ప్రణాళిక పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి …

Read More »

ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధత కలిగిన బాధ్యతల్ని నిర్వహించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధత కలిగిన బాధ్యతల్ని నిర్వహించాలని, ఆయా వర్గాల వారికి అవగాహనా కల్పించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో వివిధ వర్గాల ప్రజలు మరియు అణగారిన మరియు వెనుకబడిన వారి ప్రయోజనాల కోసం చట్టపరమైన మరియు సామాజిక సాధికారత పథకాలపై సమన్వయ …

Read More »

పేద ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి కృషి

-ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ద్వారా సలహాలు అడిగాం -వక్ఫ్ ఆస్తులు అమ్ముతున్నామనేది అబద్ద ప్రచారం -వక్ఫ్ బోర్డు 3 సంవత్సరాల కాలపరిమితితో మాత్రమే లీజుకు ఇస్తుంది -200 మంది విద్యార్థులను ఐఐటీ, ఐఐఎమ్ కోర్సుల్లో చదివిస్తాం -రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వక్ఫ్ బోర్డు ఆస్తులు అమ్ముతున్నాం అనే ప్రచారం అబద్ధమని ఆ వార్తలను ఖండిస్తున్నామని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు.. వన్ టౌన్ లో …

Read More »

ప్రతి క్లైమ్ కు తగిన రిజిస్టర్ లను బిఎల్ఓలు మైంటైన్ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు క్లైమ్స్ పరిష్కారం చేయాలని, ప్రతి క్లైమ్ కు తగిన రిజిస్టర్ లను బిఎల్ఓలు మైంటైన్ చేయాలని పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ, జిఎంసి అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు బుధవారం శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గ బిఎల్ఓలకు శిక్షణ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రతి బూత్ లెవల్ ఆఫీసర్ (బిఎల్ఓ) …

Read More »

కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజలకు అందించేందుకు సమన్వయంతో కృషి చేయాలి

-కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, పురోగతిపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి సమీక్ష -20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వాటి అభివృద్ధి ఫలాలను అర్హులైన పేద ప్రజలకు అందించేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో బుధవారం చైర్ పర్సన్ లంకా దినకర్, …

Read More »

ఎం ఎస్ ఎం ఈ పార్క్ నేలకొల్పుటకు అనువైన స్థలాలను గుర్తించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నియోజకవర్గానికి ఒక ఎం ఎస్ ఎం ఈ పార్క్ నేలకొల్పుటకు అనువైన స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ డివిజన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి ఛాంబర్ నుండి రెవెన్యూ డివిజనల్ అధికారులతో ఎం ఎస్ ఎం ఈ పార్కుల ఏర్పాటు పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పాల్సి ఉందన్నారు. …

Read More »

ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి అంగీకారంతో ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులు, ఆర్డీవోలతో సంయుక్త సమావేశం నిర్వహించి పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకారం మేరకు అనువైన చోట ఆదర్శ ప్రాథమిక …

Read More »

అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మొవ్వ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. బుధవారం ఉదయం కృష్ణాజిల్లా మండల కేంద్రమైన మొవ్వ గ్రామం బస్టాండ్ సెంటర్లో 38 లక్షల రూపాయల గ్రామపంచాయతీ నిధులతో చేపట్టిన వ్యాపార దుకాణాల సముదాయము, డ్రైనేజీ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార రాజా తో కలిసి పాల్గొని పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ …

Read More »