Breaking News

Daily Archives: June 19, 2025

జూన్ 21న ఘనంగా అంతర్జాతీయ యోగా డే

-రెండు గిన్నీస్ బుక్ రికార్డులు , మొత్తం 22 ప్రపంచ రికార్డుల సాధన లక్ష్యంగా యోగాంధ్ర -విశాఖ వేదికగా ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకూ ఏర్పాట్లు -ప్రధాని మోదీ హాజరు కానున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపు -రౌడీయిజం , హింస ప్రేరేపించేలా జగన్ పరామర్శ యాత్రలు -కొట్టండి, చంపండి, వార్ డిక్లేర్ అంటూ చేసే హింసా నినాదాల్ని సమాజం అంగీకరించదు -సినిమాలో డైలాగ్ చెబితే తప్పులేదంటున్న వాళ్లు సినిమాల్లో చంపినట్టు నిజజీవితంలోనూ చంపేస్తారా -గోదావరి జలాలను రెండు …

Read More »

వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితే అదనపు ప్రోత్సాహకాలు

-యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన ప్రధాన అంశం కావాలి -అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు..అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి ప్రభుత్వ లక్ష్యం -పర్యాటకం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అభివృద్ధికి చోదకంగా మారాలి -రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -7వ ఎస్ఐపీబీ సమావేశంలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు ఆమోదం -పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి వివరాలు ఆన్‌లైన్ పోర్టల్‌లో పెట్టాలని సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు, ప్రాజెక్టులకు అదనపు …

Read More »

అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో జిల్లా ప్రజలు చురుగ్గా పాల్గొనాలి

-అనంతపురం నగరంలోని పిటిసి గ్రౌండ్ లో శనివారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగాంధ్ర కార్యక్రమం -ప్రెస్ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 21వతేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో జిల్లా ప్రజలు చురుగ్గా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో ఈనెల 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో …

Read More »

ప్రభుత్వ ఆదేశాల మేర మద్దతు ధర చెల్లించాలి . . లేకుంటే కరిన చర్యలు : జిల్లా కలెక్టర్

గంగాధర నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : తోతాపురి మామిడిపై మద్దతు ధరకన్నా తక్కువ చెల్లించేవారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. గురువారం గంగాధర నెల్లూరు లోని జైన్ ఫ్యాక్టరీ ని, గుడి పాలెం ఆర్ ఎమ్ ఎం ఫ్యాక్టరీని జిల్లా కలెక్టర్ స్వయంగా సందర్శించి మామిడి కాయల కొనుగోలు పై పరిశ్రమ యాజమాన్యం, రైతులు తో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేర తోతాపురి మామిడికాయలకు మద్దతు ధర చెల్లించాలని, ట్రేడర్లు, రైతులను …

Read More »

మోడీ ఫిట్నెస్ మంత్ర ఇంటింటి ప్రచారానికి డాక్టర్ల సహకారం కోరిన యోగ శక్తి సాధనా సమితి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : 11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు డాక్టర్ నోరి రామ శాస్త్రి ఆయుర్వేద కాలేజీలో జరిగిన ‘పీఎం మోడీ ఫిట్నెస్ మంత్ర ‘అవగాహన సదస్సును కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ నిర్మల జ్యోతి భాయ్ సభకు అధ్యక్షత వహించారు.యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ మోడీ ఫిట్నెస్ మంత్ర ఇంటింటి ప్రచారానికి డాక్టర్ల సహకారం అభ్యర్థించారు. మోడీ ఫిట్నెస్ మంత్ర యోగ ఆకుప్రెషర్ విభాగానికి చెందినదని, ఇది …

Read More »

మున్సిపల్  కార్మికుల సమస్యలు పరిష్కరించాలి… : వేములు జైపాల్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నిరసన దీక్ష చేపట్టి నేటికీ 45 రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావటం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నగర ఉపాధ్యక్షుడు వేములు జైపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం, అలంకార్ సెంటర్ ధర్నాచౌక్ లో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 45వ రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల గోడు పట్టించుకోకుండా ప్రభుత్వం …

Read More »

ఈ నెల 23న “సుపరిపాలన – స్వర్ణాంధ్ర” కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తుళ్లూరు మండలం వెలగపూడి రాష్ట్ర సచివాలయం సమీపంలో ఈ నెల 23 వ తేదీన “ సుపరిపాలన – స్వర్ణాంధ్ర ” కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను గురువారం సాయంత్రం సీఆర్డిఏ కమిషనర్ మరియు జిల్లా ప్రత్యేక అధికారి కన్నబాబు , జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి , జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ , సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ , సీఆర్డిఏ అడిషనల్ కమిషనర్ నవీన్ …

Read More »

తోతాపురి మామిడి రైతులకు తక్కువ ధర చెల్లించే రాంపు దారులపై చర్యలు తీసుకుంటాం

-రైతులకు తక్కువ ధర చెల్లిస్తున్న రెండు రాంపుదారులపై కేసు పెట్టించిన జిల్లా కలెక్టర్ -అన్ని రాంపుల వద్ద విఆర్ఓ లను,పోలీస్ కానిస్టేబుల్ లను ఉంచండి -మామిడిరైతులకు ఏవైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 0877 2236007 నకు ఫోన్ చేయండి -జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దామల్ చెరువు, నేటి పత్రిక ప్రజావార్త : తోతాపురి మామిడి రైతులకు తక్కువ ధర చెల్లించే రాంపు దారులపై కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ రాంపు దారులను హెచ్చరించారు. గురువారం …

Read More »

24 గంటలు హెల్ప్ లైన్/ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు…

-మహిళలు తమ సమస్యలు తెలపడానికి హక్కులను కాపాడుకోవడానికి ఎప్పుడైనా 24 గంటలు హెల్ప్ లైన్/ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు : జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డా. అర్చన మంజుదార్ -మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా జాతీయ మహిళా కమిషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుంది : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ -మహిళలకు సంబంధించిన ప్రతి సమస్యను పర్సనల్ గా తీసుకొని మహిళా కమిషన్ న్యాయం చూపుతుంది : ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

ప్రపంచ సికిల్ సెల్ అనీమియా దినోత్సవం సందర్భంగా అవగాహనా ర్యాలీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు ప్రపంచ సికిల్ సెల్ అనీమియా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధి కారి కార్యాలయం నుండి స్విమ్స్ సర్కిల్ వరకు అవగాహనా ర్యాలీ నిర్వహించ బడినది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాల కృష్ణ నాయక్ ప్రసంగిస్తూ సికిల్ సెల్ అనీమియా అనేది ఆంధ్ర ప్రదేశ్‌ లో ముఖ్యంగా గిరిజన జనాభా లో గణనీయమైన ప్రాబల్యం కలిగిన జన్యు రుగ్మత అని దగ్గరి బంధువుల మధ్య వివాహాలు …

Read More »