-యువతకు జాతీయ, అంతర్జాతీయ ప్లేస్‌మెంట్స్ కల్పించడమే లక్ష్యం -20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన ఎజెండాగా పనిచేయాలి -ఆధునిక సాంకేతికతకు తగ్గట్టు కొత్త కోర్సులు -‘నైపుణ్యం’ పోర్టల్‌లో సమగ్ర సమాచార అనుసంధానం -నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు -రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాల నిర్వహణకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో …
Read More »Daily Archives: June 24, 2025
రాజధాని నిర్మాణానికి బంగారు గాజులు విరాళం ఇచ్చిన మహిళ
-36 గ్రాముల బంగారు గాజులు, రూ.1 లక్ష నగదును సీఎంకు అందజేసిన నన్నపనేని ఉదయలక్ష్మీ -రూ.50 వేలు విరాళం ఇచ్చిన వెలగపూడి చంద్రావతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు విరాళం ఇచ్చి తమ ఔదార్యం చాటారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలనే మంచి ఆలోచనతో తమవంతు సాయం అందించారు. సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబును కలిసిన తెనాలి, విజయవాడకు చెందిన ఇద్దరు మహిళలు 4 చేతి గాజులు, నగదును విరాళంగా ఇచ్చారు. తెనాలికి చెందిన …
Read More »26 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో అంశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన 26 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు… 1. పురపాలక &పట్టణాభివృద్ధి శాఖ : ఆంధ్ర ప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ భూమి పూలింగ్ స్కీమ్ (ఫార్ములేషన్&ఇంప్లిమెంటేషన్) రూల్స్, 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం …
Read More »భవన నిర్మాణాల నిబంధనలు సరళతరం
-రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భవన నిర్మాణాల నిబంధనలు సరళతరం చేసే విధంగా పలు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెల్పినట్లు రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ చిన్న భవనాలకు అనుమతులు మరియు సెట్ బ్యాక్ విషయాల్లో వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. గతంలో 5 అంతస్తులు, ఆపై అంత్తసుల భనాలకు నిబంధనలను చాలా సరళతరం …
Read More »రైతులు పక్వానికి వచ్చిన మామిడి కాయలనే కోసి మార్కెట్లకు తరలించాలి
-మామిడి రైతులకు న్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయం -జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గుడిపాల, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు పక్వానికి వచ్చిన మామిడి కాయలనే కోసి మార్కెట్లకు తరలించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రైతులకు తెలిపారు. మంగళవారం సాయంత్రం సమయంలో గుడిపాలలోని ఫుడ్ అండ్ ఇన్స్.tasa మామిడి గుజ్జు పరిశ్రమలని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి చివరి మామిడికాయ వరకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయడం జరుగుతుందని ఎవరు …
Read More »రైతులకు నష్టం వాటిల్లకుండా మామిడి కొనుగోలు చేయాలి
-రాష్ట్ర ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ సంచాలకులు డా. కె.శ్రీనివాసులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు నష్టం వాటిల్లకుండా మామిడి కొనుగోలు చేయాలని రాష్ట్ర ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ సంచాలకులు డా. కె.శ్రీనివాసులు పేర్కొన్నారు.మంగళవారం మధ్యాహ్నం రేణిగుంట సమీపంలోనిశ్రీ వర్ష జ్యూస్ ప్రాసెసింగ్ యూనిట్ ను జిల్లా ఉద్యాన వన అధికారులతో కలసి తనిఖీ ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ వర్ష ఫుడ్ ప్రొడక్ట్స్ యూనిట్ ను రాష్ట్ర ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ సంచాలకులు తనిఖీ …
Read More »ఆర్చరీ క్రీడాకారులకు శాప్ ఛైర్మన్ అభినందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ సింగపూర్ లో జరిగిన ఆర్చరీ ఏషియా కప్ లెగ్-2 పోటీల్లో కాంపౌండ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారుడు టి.గణేష్ మణిరత్నం, అలాగే ఇండివిడ్యువల్, మిక్సిడ్, టీమ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్స్ సాధించిన క్రీడాకారిణి బి.షణ్ముఖి నాగసాయి విజయవాడలోని శాప్ కార్యాలయంలో శాప్ ఛైర్మన్ రవినాయుడుని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్చరీలో వారు సాధించిన పతకాలు, విజయాలు గురించి వివరించారు. సందర్భంగా వారిని శాప్ …
Read More »నేర రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దడానికి చర్యలు
-సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల తగ్గిన నేరాల సంఖ్య -పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని 9 కాలనీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, -ఎమ్మెల్యే గద్దె రామమోహన్, సీపీ రాజశేఖర్‌బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేర రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్, పోలీస్ కమీషనర్ రాజశేఖర్‌బాబు చెప్పారు. మంగళవారం తూర్పు నియోజకవర్గంలోని పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని …
Read More »సంక్షేమం, అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పించటమే ప్రధాన లక్ష్యం : ఎంపీ కేశినేని శివనాథ్
-ఎంపీ గా ఏడాది పూర్తి చేసుకున్న ఎంపీ కేశినేని చిన్ని -ఎన్టీఆర్ భవన్ లో ఏడాది పాలనపై ఎంపీ మీడియా సమావేశం -ఏడాది అభివృద్దిపై సుపరిపాలనలో తొలిఅడుగు పుస్తకావిష్కరణ -20 కేజీల కేక్ కట్ చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ -ఎంపీ కేశినేని శివనాథ్ ను సన్మానించిన టిడిపి నాయకులు, కార్యకర్తలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏళ్లుగా పరిష్కారం కానీ రైల్వే పనులు పరిష్కరించటంతో పాటు ఎంపీగా ఏడాది పాలనలో ఎనిమిది ఆర్.వో.బిలు …
Read More »అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు నగరంలో పర్యటన చేసే మార్గాల్లో జిఎంసి, పోలీస్ విభాగాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్ లోని శ్రీ కన్వెన్షన్ నుండి జేకేసి కాలేజి రోడ్ వైపుగా గుజ్జనగుండ్ల సెంటర్, రింగ్ రోడ్, విద్యా నగర్ మెయిన్ రోడ్ వరకు ఏఎస్పీ …
Read More »
Prajavartha Online Telugu News