Breaking News

Daily Archives: June 9, 2025

భ‌విష్య‌త్ అంతా షైనింగ్ స్టార్స్ దే

-ప్రైవేటుకు ధీటుగా ప్ర‌భుత్వ విద్య‌ -క‌స్తూర్భా గాంధీ పాఠ‌శాల‌ల్లో మౌలిక వసతుల అభివృద్ధి -విద్య గొప్పతనం తెలిసిన సీఎం చంద్రబాబు -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ ప‌ల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త షైనింగ్ స్టార్స్ అవార్డులు అందుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉంద‌ని ప‌ల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో 10వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్ చ‌దివి అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థినీ, విద్యార్థుల‌ను షైనింగ్ స్టార్స్ పేరిట ఘ‌నంగా స‌న్మానించారు. …

Read More »

అన్నదాత సుఖీభవ పథకాన్ని తక్షణమే రైతులకు అందించాలి… : పి.జమలయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని, కేంద్రప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను పునపరిశీలించి డాక్టర్ స్వామినాథన్ సిఫారసుల ప్రకారం సమగ్ర ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని,కౌలురైతుల రక్షణ కోసం నూతనకౌలు చట్టాన్ని తీసుకురావాలని తద్వారా కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతులసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలురైతు సంఘాల …

Read More »

‘రాష్ట్రంలో శరవేగంగా రహదారుల నిర్మాణం

-రహదారుల నిర్మాణానికి కావాల్సిన అన్ని క్లియరెన్సులు జులై నాటికి పూర్తి చేయాలి -ఈ ఏడాది 1,040 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణం లక్ష్యం -రహదారుల అభివృద్ధిపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, త్వరలో నిర్మించ తలపెట్టిన అన్ని రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ, వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జూలై నెలాఖరుకు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా …

Read More »

తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు నిర్మాణం

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -పదో తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు షైనింగ్ సార్ట్స్ అవార్డులు -విద్యా వ్యవస్థలో నాణ్యత, ప్రమాణాలు పెంచేందుకు షైనింగ్ సార్ట్స్ అవార్డులు అందిస్తున్నామన్న మంత్రి కందుల దుర్గేష్ -172 మందిని అవార్డులతో సత్కరించిన మంత్రి కందుల దుర్గేష్ -అవార్డులు పొందిన విద్యార్థినీ విద్యార్థులకు శుభాశీస్సులు అందించిన మంత్రి దుర్గేష్ సాధారణ విద్యను పక్కనబెట్టి అవకాశాల గని అయిన క్వాంటం వ్యాలీని అభ్యసించాలని సూచన -పట్టుదల, కష్టపడేతత్వం, బాగా చదవగలిగిన నేర్పు, …

Read More »

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొదటి దశ సమీక్ష పూర్తి

-20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మెన్ లంకా దినకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మొదటి సంవత్సరం డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో అధికారుల సహకారంతో అన్ని జిల్లాల మొదటి దశ సమీక్షలు పూర్తి చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మెన్ లంకా దినకర్ తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబరులో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ జిల్లాల సమీక్షలలో పథకాల వారీగా గుర్తించిన అంశాలను ఆయన వివరించారు. 2024 ఎన్నికల విజయం అనంతరం కేంద్రంలో ప్రధానిగా శ్రీ …

Read More »

‘స్వర్ణాంధ్ర -2047’ విజన్ అమలుకు మరింత ఊతం

-జిల్లా, నియోజకవర్గ కార్యాలయాల ఏర్పాటు కొత్త చరిత్ర -ఒక్కో కార్యాలయ నిర్వహణకు రూ.10 లక్షలు కేటాయింపు –ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -26 జిల్లా, 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా, నియోజకవర్గాల విజన్ యాక్షన్‌ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ఏర్పాటుతో స్వర్ణాంధ్ర-2047 విజన్ సాకారానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయం లేదని…ఇప్పుడు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల …

Read More »

ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్‌పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-సిలికాన్ వ్యాలీలా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఒక ప్రత్యేక గుర్తింపు పొందాలి -ఈనెల 30న క్వాంటమ్ మిషన్‌పై విజయవాడలో వర్క్ షాప్ -క్వాంటమ్ మిషన్‌పై ఐటీ రంగ నిపుణులతో సిఎం చంద్రబాబు సమీక్ష -క్వాంటమ్ వాలీ ఎకోసిస్టం ఏర్పాటుపై అభిప్రాయాల సేకరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సిలికాన్ వ్యాలీలా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఒక ప్రత్యేక గుర్తింపు పొందాలని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఏఐకి ఏపి స్టేట్ క్వాంటమ్ మిషన్ దారి చూపాలని సిఎం అన్నారు. ఏపీ …

Read More »

విలువలతో కూడిన జర్నలిజం ఉండాలి.. దీనిపై చర్చ జరగాలి

-ఆలపాటి సురేష్ కుమార్, చైర్మన్, సి. రాఘవాచారి మీడియా అకాడమి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో, రాష్ట్రంలో విలువలతో కూడిని జర్నలిజాన్నిప్రోత్సహించాలని సి. రాఘవాచారి మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. మొఘల్ రాజ పురంలోని సి. రాఘవాచారి మీడియా అకాడమి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ మీడియాలో నైతిక విలువలు చాలా ముఖ్యమని ఎవరికి వారు ఆ విలువలను పాటిస్తే సమస్యలు రావన్నారు. కొందరు అనైతిక జర్నలిజాన్ని …

Read More »

కృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకోవాలి… : జిల్లా కలెక్టర్

-పదవతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ బహుకరణ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు శ్రమించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు ఉద్బోధించారు. 2024–25 విద్యా సంవత్సరంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సోమవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి …

Read More »

ప్రైవేటురంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం!

-ప్రభుత్వవిద్యను బలోపేతం చేయడానికే సంస్కరణలు -రాబోయే నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం -కష్టపడి చదివే బాధ్యత మీది… మేం చేయూత నందిస్తాం! -జీవితంలో ఏస్థాయికి చేరినా వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి -షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి నారా లోకేష్ పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రైవేటురంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తెస్తున్నా, అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నా, సంస్కరణల ద్వారా రాబోయే నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి …

Read More »