-సి ఆర్ ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటికి నిమ్మరాజు వినతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్తు జీవనోపాధి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ శిక్షణా తరగతులతో జర్నలిస్టులకు జర్నలిజం సర్టిఫికెట్ కోర్సులు నిర్వహించాలని సిఆర్ ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ను శుక్రవారం కలిసిన సీనియర్ జర్నలిస్టు, ఉమ్మడి రాష్ట్ర అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ మాజీ సభ్యుడు నిమ్మరాజు చలపతిరావు విజ్ఞప్తి చేశారు. నాలుగు దశాబ్దాల క్రితం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లాల్లో శిక్షణ తరగతులు …
Read More »Daily Archives: June 13, 2025
ఈ ఏడాదిలో రక్తహీనత తగ్గించాలన్నదే లక్ష్యం
-రక్తహీనతపై రాష్ట్రస్థాయి శిక్షణ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ ఏడాది రక్తహీనతను(ఎనీమియా) తగ్గించాలన్న లక్ష్యంతో సంబంధిత శాఖల అధికారులతో కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలపై రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించామని ఎనీమియా ముక్త్ భారత్ రాష్ట్ర నోడలాఫీసర్ డాక్టర్ ఎల్‌బియస్‌హెచ్ దేవి అన్నారు. ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలోని హాయ్ ల్యాండ్లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం నాడు నిర్వహించిన శిక్షకులకు శిక్షణా కార్యక్రమం(ToT)లో ఆమె మాట్టాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమం, …
Read More »హజ్ యాత్రికుల తిరుగు ప్రయాణం ప్రారంభం
-హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన 49 మంది తొలి బృందం -ప్రభుత్వ ఏర్పాట్ల పై సంతృప్తి -రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హజ్ యాత్ర-2025కు బయలుదేరి వెళ్లిన యాత్రికులు తమ ఆధ్యాత్మిక యాత్రను విజయవంతంగా ముగించుకొని తిరుగు ప్రయాణాల రాక ప్రారంభమైందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు.ఈ మేరకు శుక్రవారం అమరావతిలో ప్రకటన విడుదల చేశారు. *రాష్ట్రం నుండి బయలుదేరిన 1618 హజ్ …
Read More »నేతన్నలకు వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీలు పెంపు
-రాష్ట్ర బి.సి.,ఇ.డబ్ల్యు.ఎస్. సంక్షేమం, చేనేత మరియు టెక్సటైల్స్ శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వేలాది మంది నేతన్నలకు లబ్దిచేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీలను పెంచే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు రాష్ట్ర బి.సి., ఇ.డబ్ల్యు.ఎస్. సంక్షేమం, చేనేత మరియు టెక్సటైల్స్ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ సాంప్రదాయ చేనేత రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ కీలక …
Read More »లాం ఫారం లో మిరప విత్తనాలు అమ్మకానికి సిద్ధం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానము, లాం ఫారంలో జూన్ నెల 16 వ తేది (సోమవారం) నుండి ఎల్.సి ఎ–625, ఎల్.సి ఎ–657 మరియు ఎల్.సి.ఎ-643 మిరప రకాల ఫౌండేషన్ విత్తనం అమ్మనున్నట్లు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్. సి. వెంకట రమణ తెలియజేశారు. ఎల్. సి ఎ–643 రకం పచ్చిమిర్చికి, ఎండు మిర్చికి అనువైన రకము. కాయలు లేత ఆకుపచ్చ రంగులో పొడవుగా (13-14 సెం.మీ) ఆకర్షణీయంగా ఉంటాయి. కాయలు ఎండిన …
Read More »బెలూం గుహలకు జీఎస్ఐ గుర్తింపు దక్కడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం
-పురాతన సంస్కృతీ, వారసత్వానికి బెలుం గుహలు ప్రతీకని వెల్లడి -అంతర్జాతీయ స్థాయిలో బెలూం గుహలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పురాతన సంస్కృతీ, వారసత్వానికి ప్రతీక అయిన బెలుం గుహలకు భౌగోళిక వారసత్వ జాబితాలో చోటు దక్కడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ప్రకటనతో నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో క్రీ.పూ 450 ఏళ్ల నాటి చరిత్ర గలిగి సుమారు …
Read More »చంద్రబాబు కృషి వలన రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ కార్పొరేషన్ ద్వారా పథకాలు,పెన్షన్లు,బీసీ కార్పొరేషన్ లోన్స్,ఆదరణ పథకం2 పథకం ద్వారా కులవృత్తులు చేసుకునే బీసీలకు సబ్సిడీతో కూడిన లోన్లు అందిస్తామని అన్నారు. విజయవాడ గొల్లపూడి బీసీ భవన్ గవర కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర బీసీ కమిషన్ ఈడి ఉమాదేవి, ఆఫీసర్ రఘు, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర ఆధ్వర్యంలో బోర్డు డైరెక్టర్లతో మీటింగ్ నిర్వహించడం జరిగింది. సమావేశం ముందుగా అహ్మదాబాద్ విమాన ప్రయాణ మృతులకు నివాళులు అర్పిస్తూ మృతులకుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. …
Read More »నగరపాలక సంస్థ ఆదాయానికి నష్టం కల్గించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం….
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో మునిసిపల్ ట్యాప్ కనెక్షన్ల మంజూరులో నగరపాలక సంస్థ ఆదాయానికి గండి పడేలా వ్యవహరించిన ఏఈలు పి.వెంకటేశ్వరరావు, కె.సాంబశివరావులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ ఆదాయానికి నష్టం కల్గించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబందనల మేరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని కమర్షియల్ లేదా బహుళ అంతస్తు భవనాలు, నివాస గృహాలకు …
Read More »ప్రజారోగ్య పరిరక్షణలో ప్రజారోగ్య విభాగం కీలకం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య పనుల పర్యవేక్షణ విధుల్లో నిర్లక్ష్యవైఖరి కారణంగా, ప్రజారోగ్య విభాగ ప్రాధాన్యత మేరకు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ (ఎంహెచ్ఓ) డాక్టర్ ఎం.రవిబాబుని తమ మాతృశాఖకు సరెండర్ చేస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజారోగ్య పరిరక్షణలో ప్రజారోగ్య విభాగం కీలకమని, అటువంటి విభాగం సమర్దవంతంగా పనిచేసేలా పర్యవేక్షణ చేయాలని, అందుకు అవసరమైన సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపినప్పటికీ ఎంహెచ్ఓ రవిబాబు పనితీరు …
Read More »అన్నక్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని, క్యాంటీన్లలో ఆహార సరఫరాకి నిర్దేశిత సమయాన్ని పాటించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. కమిషనర్ శుక్రవారం ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతి రోజు పరిశీలించి, మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు నిర్దేశిత …
Read More »
Prajavartha Online Telugu News