Breaking News

Daily Archives: July 29, 2026

స్వదేశ్ దర్శన్ 2.0 పథకం ద్వారా బందరు బీచ్ అభివృద్ధికి తోడ్పాటు అందించండి

-మచిలీపట్నానికి గల చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతాం -కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి విన్నవించిన మంత్రి కొల్లు రవీంద్ర న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశానికి తూర్పుతీరంలోని పురాతన పట్టణాల్లో ఒకైన మచిలీపట్నం యొక్క సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని పునరుద్దరించేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి తగిన సహాయ సహకారాలు అందించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర …

Read More »

కృష్ణా జిల్లా అభివృద్ధిపై కేంద్ర మంత్రులను కలిసిన మంత్రి కొల్లు రవీంద్ర

-మంగినపూడి బీచ్, ఎన్‌హెచ్216, క్రీడా భవనాలు, మైనింగ్ రంగ అభివృద్ధిపై వినతిపత్రాలు అందజేత న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రెండు రోజుల పాటు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. కృష్ణా జిల్లా చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంతో పాటుగా.. భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించేలా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు కావాలని విన్నవించారు. మచిలీపట్నం-బంటుమిల్లి మధ్య 20 కిలోమీటర్ల రోడ్డు …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ,ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’కు విశేష స్పందన లభిస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలు ఆకారపు విజయ కుమారి, బీ జోగేశ్వరరావు, కూర్మారావు, దేవిన హరి ప్రసాద్, దుర్బేసుల హుస్సేన్ తో కలిసి వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, వైద్య సహాయం, రేషన్ …

Read More »

పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలని కేంద్రానికి ఎంపీ వల్లభనేని బాలశౌరి విజ్ఞప్తి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి లోక్‌సభలో పోస్టల్ సేవలపై విధిస్తున్న జీఎస్టీకి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. సాధారణ తపాలా సేవలకు జీఎస్టీ మినహాయింపు ఉన్నప్పటికీ, స్పీడ్ పోస్ట్‌తో పాటు ఇతర పోస్టల్ సేవలపై జీఎస్టీ ఎందుకు విధిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానమిస్తూ, ప్రస్తుతం పోస్ట్‌కార్డులు, ఇన్‌ల్యాండ్ లెటర్లు, బుక్‌పోస్ట్, 10 గ్రాముల లోపు సాధారణ తపాలా కవర్లు వంటి సేవలకు …

Read More »

“స్వచ్ఛ పదం” కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా కోడూరు మండలం, కోడూరు గ్రామ పంచాయతీలో ఈరోజు నిర్వహించిన “స్వచ్ఛ పదం” కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యం.ధనలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రమైన పరిసరాల కల్పన, ఘన వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజీల పరిశుభ్రత, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలను ఉద్దేశించి జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి …

Read More »

కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం ని మర్యాదపూర్వకంగా కలిసిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కేడీసీసీ బ్యాంకు రీజినల్ కార్యాలయంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (KDCC Bank) చైర్మన్ నెట్టెం రఘురాం ని ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయాల అభివృద్ధి, ఆధునీకరణ, ప్రజలకు మరింత మెరుగైన గ్రంథాలయ సేవలు అందించేందుకు అవసరమైన చర్యలపై ఇరువురు చర్చించారు. జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కేడీసీసీ బ్యాంకు తరఫున సాధ్యమైనంత సహకారం అందించాలని ఎం.ఎస్. బేగ్ …

Read More »

క్రీడలు మానసిక వికాసానికి, ఉత్సాహానికి దోహదం చేస్తాయి

-ఉద్యోగులు ప్రతిరోజూ ఏదో ఒక క్రీడకు సమయం కేటాయించాలి కలెక్టరేట్ ఇగ్నైట్ సెల్‌లో క్రీడా పరికరాల ప్రదర్శనను సందర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం, ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిశ తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు విధుల నిర్వహణలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతిరోజూ కొంత సమయాన్ని ఏదో ఒక క్రీడకు కేటాయించాలని …

Read More »

ఎన్టీఆర్ జిల్లా ఐ.టి.ఐ లలో రెండవ విడత అడ్మిషన్లు…..

-జిల్లా కన్వీనర్ ఎం. కనకారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఐ.టి.ఐ లలో 2026-27/28 విద్యా సంవత్సరానికి గాను రెండవ విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ మరియు జిల్లా కన్వీనర్ ఎం. కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ల కొరకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 3వ తేదీ లోగా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 6వ తేదీన విజయవాడలోని ప్రభుత్వ ఐ.టి.ఐ …

Read More »

జిల్లాలో టూరిజం ప్రాజెక్టులు డీపీఆర్‌లకే పరిమితం కాకుండా గ్రౌండింగ్ కావాలి : జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ

-రూ.75 కోట్లతో ఏఎంసీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాజెక్టును జూలై-2027 నాటికి అందుబాటులోకి తీసుకురావాలి -నవరాత్రుల సందర్భంగా పున్నమి ఘాట్, ఫెర్రీ ఘాట్, బసవ పున్నయ్య స్టేడియంలో ‘విజయవాడ ఉత్సవ్’ నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి -ఇబ్రహీంపట్నం పవిత్ర సంఘం వద్ద వైదిక కమిటీ సూచనల మేరకు 30 డిగ్రీల డైమెన్షన్‌తో ప్లాట్‌ఫాం నిర్మాణం చేపట్టాలి -పర్యాటక అభివృద్ధితో జిల్లా ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతిపాదించిన పర్యాటక ప్రాజెక్టులు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుల (డీపీఆర్) దశలోనే నిలిచిపోకుండా …

Read More »

ప్రత్యేక ఫ్రాంచైజీ ప్రాజెక్టుల ద్వారా స్వయం ఉపాధికి డ్వాక్రా మహిళలకు సువర్ణావకాశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి ద్వారా డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక ఫ్రాంచైజీ ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఇంచార్జి కమిషనర్ ఏ. రవీంద్రరావు బుధవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, పట్టణ నిరుద్యోగ మహిళలు, యువతులు తక్కువ పెట్టుబడితో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి స్థిరమైన ఆదాయాన్ని పొందేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రముఖ …

Read More »