– విద్యార్థుల సమగ్రాభివృద్ధికి విలువైన వేదిక – కార్యక్రమం విజయవంతానికి సమష్టి కృషి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, సమగ్రాభివృద్ధి, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమాన్ని ఈ నెల 24న శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో …
Read More »Monthly Archives: July 2026
విజయవాడలో జూలై 24–26 వరకు బీఎన్‌ఐ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో – కాన్క్లేవ్ 4.0
-యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేదిశగా ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో నిర్వహణ -జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ చేతుల మీదుగా గోడపత్రిక ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో బీఎన్‌ఐ (BNI) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో – కాన్క్లేవ్ 4.0కు సంబంధించిన గోడపత్రికను జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్లో జూలై 24, 25, 26 తేదీలలో ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పోతో పాటు కాన్క్లేవ్ 4.0ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు …
Read More »ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల విచారణలో వేగం పెంచాలి
-ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్ దాఖలులో జాప్యం వద్దు -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులకు సంబంధించి నమోదవుతున్న కేసుల విచారణను వేగవంతం చేయడంతో పాటు ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్ దాఖలులో ఎటువంటి జాప్యం చోటుచేసుకోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సమావేశం ప్రారంభంలో గత …
Read More »ఎన్టీఆర్ జిల్లాను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు భవన యజమానులు ముందుకు రావాలి…
-ఐటీ పరిశ్రమల స్థాపనకు అనువైన భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ భూముల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలి -పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం రూపొందించిన పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో ప్రముఖ ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు భవన యజమానులు, పారిశ్రామికవేత్తలు, భూ యజమానులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. జిల్లాలో ఐటీ పరిశ్రమలు, ఐటీ/ఐటీఈఎస్ సంస్థలు, స్టార్టప్ …
Read More »హెచ్ఆర్ఎంఎస్ అమలుపై ప్రత్యేక దృష్టిపెట్టండి
– వీలైనంత త్వరగా పోర్టల్‌లో ఉద్యోగుల నమోదును పూర్తిచేయండి – జిల్లా సహకార అభివృద్ధి, సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (పీఏసీఎస్) మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ (హెచ్ఆర్ఎంఎస్) అమలుపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని, పోర్టల్‌లో ఉద్యోగుల నమోదు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో జిల్లా …
Read More »భూ రికార్డుల శాశ్వత భద్రతకు ‘మీభూమి–బ్లాక్‌చెయిన్’ బేస్డ్ ల్యాండ్ రికార్డ్స్ సిస్టం ప్రారంభం
-రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం -గన్నవరం మండలంలో 17 గ్రామాలలో తొలి దశ అమలు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భూ రికార్డుల శాశ్వత భద్రత, పారదర్శకత, భూ మోసాల నివారణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మీభూమి–బ్లాక్‌చెయిన్’ బేస్డ్ ల్యాండ్ రికార్డ్స్ సిస్టం పైలట్ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ …
Read More »మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌కు తల్లులతో పాటు తండ్రులు కూడా తప్పనిసరిగా హాజరుకావాలి…
-ప్రతి విద్యార్థి సమగ్ర ప్రగతి నివేదికపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల వ్యక్తిగత చర్చ -పాఠశాలల అభివృద్ధికి విరాళాల కోసం ‘డోనర్ యాప్’ ప్రారంభం -99 శాతం తల్లికి వందనం నగదు జమ.. ఇంకా ఎవరికైనా నగదు జమ కాకపోయినా ఫిర్యాదు చేయవచ్చు -పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్కరణల్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం) కార్యక్రమానికి కృష్ణా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ …
Read More »మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌ను విజయవంతం చేయాలి
-అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలి -జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించనున్న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం)ను ప్రతిష్ఠాత్మకంగా, విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి విద్యాశాఖ అధికారులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్షించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మెగా పీటీఎం …
Read More »అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని కలిసి ఆగస్ట్ 1వ తేదీన జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
Read More »రైతు కష్టానికి అండగా కూటమి ప్రభుత్వం… కేంద్రంతో ఫలించిన చర్చలు
– జీఎస్టీ తగ్గింపు, అదనపు సాయంపై కేంద్రం నుంచి శుభసూచనలు – వాస్తవాలు తెలుసుకుని కూడా జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు – వైసీపీ కార్యకర్తలకు కండువాలు కప్పి రైతులంటారా? – క్రిమినల్ రాజకీయాలకు వైసీపీ ప్రతీకగా మారింది – అధికార దుర్వినియోగం చేసిన వారిని ఉపేక్షించేది లేదు – వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పొగాకు, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, కేంద్ర …
Read More »
Prajavartha Online Telugu News