-పార్లమెంట్‌లో భగీరథ్ చౌదరి కీలక సమాధానం -ఏపీ లో నాలుగు వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు గుర్తింపు… -ఏ. పి. కి ఐదేళ్లలో రూ.56.11 కోట్ల కేంద్ర సాయం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమల భాగస్వామ్యం, విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, ఆధునిక పాఠ్యాంశాల అమలు, కేంద్రం అందిస్తున్న నిధుల వివరాలపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి సమగ్ర లిఖితపూర్వక …
Read More »Daily Archives: August 4, 2026
షేక్ బాజీ సాహెబ్ ఉర్దూ ప్రైమరీ పాఠశాల అభివృద్ధికి చర్యలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాధరపురంలోని, షేక్ బాజీ సాహెబ్ మున్సిపల్ ఉర్దూ ప్రైమరీ పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. మంగళవారం కూటమి నేతలతో కలిసి పాఠశాలను పరిశీలించారు. తమ బడిలో ప్రధాన సమస్యలైన తాగునీరు, విద్యుత్ లైన్ల రిపేర్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రధానోపాధ్యాయురాలు సయ్యద్ తాహెరా జమీల్ ప్రత్తిపాటి శ్రీధర్ కు తెలిపారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి పాఠశాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని త్వరలో అంచనా రూపొందించి …
Read More »ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’ కు విశేష స్పందన లభిస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ ఉమ్మడి (చంటి) కూటమి నేతలు పీ వీ చిన సుబ్బయ్య, నాగోతి రామారావు, బొమ్ము రాంబాబు, తారిఖ్ అజీజ్, దుర్గా ప్రసాద్, బెన్నా భక్తుల సోమేశ్వరరావు , ఏలూరి సాయి శరత్, కూటమి నేతలతో కలిసి వినతులు …
Read More »సౌదీలో చిక్కుకున్న భవానిపురం యువకుడికి ఊరట
-ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో స్వదేశానికి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సౌదీలో చిక్కుకు పోయిన బాధితుడు శీలం సురేష్ రెడ్డి ను ఇండియాకు తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక చొరవ చూపారు. విజయవాడ, భవాని పురానికి చెందిన సురేష్ పది నెలల క్రితం ఉపాధి కోసం సౌదీ వెళ్ళి ఏ సీ టెక్నీషియన్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అక్కడ కాంట్రాక్టర్ గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకుండా, ఆహారం, ఆశ్రయం వంటి కనీస అవసరాలు కల్పించకుండా ఇబ్బందులు …
Read More »తిరుపతి జిల్లాలో చెరకు సాగు క్షీణత ఆందోళనకరం
-చెరకు సాగు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరిన ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం, ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఎంపీ గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి కారణాలు, రైతులకు అందిస్తున్న సహాయం, చెరకు పరిశ్రమ పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలపై తిరుపతి ఎంపీ గురుమూర్తి మంగళవారం లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత ఐదేళ్లలో …
Read More »నాయుడుపేట, తూర్పుకనుపూరు ఎన్‌హెచ్-71కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలి
-ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి 71పై పుదూరు జంక్షన్ నుంచి అన్నమేడు ఆర్‌అండ్‌బీ రోడ్డు జంక్షన్ వరకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం న్యూఢిల్లీలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎంపీ గురుమూర్తితో కలిసి స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ …
Read More »ఠాగూర్ గ్రంథాలయంలో మండలి వెంకట కృష్ణారావు జయంతి వేడుక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో ఈరోజు మండలి వెంకట కృష్ణారావు జయంతి వేడుక ఘనంగా నిర్వహించబడింది. గ్రంథాలయాధికారికే రమాదేవి ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన గురించి మాట్లాడుతూ ప్రముఖ విద్యావేత్త సంఘ సేవకులు తెలుగు భాష- సంస్కృతి పరిరక్షకుడు విశేష కృషి చేశారు. అంతేకాక యువతలో జ్ఞాన దాహాన్ని పెంచడం వంటి అంశాలను ఆయన ఇచ్చిన ప్రాధాన్యత నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరణలో …
Read More »జీజీహెచ్ అభివృద్ధి, రోగులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
-గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు -జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు అభివృద్ధి ప్రతిపాదనలకు ఆమోదం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో అభివృద్ధి, రోగులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, ఆసుపత్రి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, భద్రత, పారిశుద్ధ్యం, విద్యుత్ వ్యవస్థ, …
Read More »కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యానికి ఎకో సెన్సిటివ్ జోన్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
-జిల్లా స్థాయి సమీక్షలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యానికి ఎకో సెన్సిటివ్ జోన్‌ను జిల్లా పరిస్థితులు, ప్రజల జీవనోపాధి, అభివృద్ధి అవసరాలను సమన్వయం చేస్తూ శాస్త్రీయ ప్రాతిపదికన ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం (Kolleru Wildlife Sanctuary) పరిధిలో కృష్ణా జిల్లాలోని గుడివాడ మండలంలోని 12 గ్రామాలు, బాపులపాడు మండలంలోని 5 …
Read More »మన బడి–మన భవిష్యత్తు పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
-ఏ దశలోనూ జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మన బడి–మన భవిష్యత్తు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాల కల్పన, మేజర్, మైనర్ మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) తదితర శాఖల అధికారులతో మన బడి–మన …
Read More »
Prajavartha Online Telugu News