Breaking News

Daily Archives: August 20, 2026

రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతర వైద్య సేవలు

-రోగులకు సౌకర్యాల కల్పనపై ఆరా -న్యూ జీజీహెచ్ లో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆకస్మిక తనిఖీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం రాత్రి న్యూ జీజీహెచ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అత్యవసర చికిత్స విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది అందుబాటు, రోగులకు సౌకర్యాలను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే రోగులకు తక్షణ వైద్యం అందేలా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని …

Read More »

పీఎం రాహత్ కింద ప్రమాద బాధితులకు అన్ని నెట్‌వర్క్ ఆసుపత్రులు వైద్య సహాయం అందించాల్సిందే

-నగదు రహిత వైద్య సేవలను తిరస్కరించకూడదు -పథకంపై ఆసుపత్రులు, ప్రజలకు పూర్తి అవగాహన అవసరం -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు పీఎం రాహత్ పథకం కింద నగదు రహిత అత్యవసర వైద్య సేవలు అందించడం నెట్‌వర్క్ ఆసుపత్రుల బాధ్యతని, చికిత్స అందించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించకూడదని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం జిల్లాలోని 51 నెట్‌వర్క్ ఆసుపత్రుల …

Read More »

ఒత్తిడిని జయించి.. విధుల్లో రాణిద్దాం

– ప్రశాంత మనసుతోనే మెరుగైన పనితీరు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ – విజ‌య‌వంతంగా స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కార్యక్ర‌మం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వివిధ సేవలు అందించే ఉద్యోగులు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని.. ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించి, సానుకూల పని వాతావరణాన్ని పెంపొందించేలా ప్ర‌త్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. గురువారం న‌గ‌రంలోని క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌య స‌మావేశ మందిరంలో ఆక‌ర్ష ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో …

Read More »

ఎన్టీఆర్ వైద్య సేవల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు

-90 కేసులపై విచారణ — ఐదు ఆసుపత్రులపై ఆరోపణలు నిర్ధారణ -ఐదు ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులకు అపరాధ రుసుము విధింపు -పేదలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించాలి -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ వైద్య సేవల పథకం కింద పేదలకు అందుతున్న ఉచిత వైద్య సేవల్లో అవకతవకలు, నిర్లక్ష్యం, అక్రమ వసూళ్లకు పాల్పడే నెట్‌వర్క్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ …

Read More »

జిల్లాకు 57 సీజ‌న‌ల్ హాస్ట‌ళ్ల మంజూరు

– నిర్వ‌హ‌ణ‌కు ఈ నెల 24లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి – స‌మ‌గ్ర‌శిక్ష జిల్లా ఏపీసీ ఆర్‌.ర‌మేష్‌బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాకు 57 సీజ‌న‌ల్ హాస్ట‌ళ్లు మంజూరయ్యాయ‌ని.. వీటి నిర్వ‌హ‌ణ‌కు గిరిజ‌న‌, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖ‌ల‌తో పాటు స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, రిజిస్ట‌ర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ‌ల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు స‌మ‌గ్ర‌శిక్ష జిల్లా అడిష‌న‌ల్ ప్రాజెక్టు కోఆర్డినేట‌ర్ (ఏపీసీ) ఆర్‌.ర‌మేష్‌బాబు గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో కోరారు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంట‌లులోగా ద‌ర‌ఖాస్తు …

Read More »

శిశు గృహ సంరక్షణలో ఉన్న బాలుడిని చట్టబద్ధంగా దత్తత

-దత్తత ప్రక్రియలో అన్ని నిబంధనలు, పత్రాలను పరిశీలన -జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రత్యేక దత్తత సంస్థ శిశు గృహంలో సంరక్షణలో ఉన్న బాలుడిని గురువారం జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ఆధ్వర్యంలో చట్టబద్ధంగా దత్తతు ప్రక్రియను చేపట్టడం జరిగింది. దత్తత ప్రక్రియలో భాగంగా బాలుడి గుర్తింపుకు సంబంధించిన వివరాలు, దత్తత తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, సంబంధిత ధ్రువపత్రాలు, పత్రికా ప్రకటన, ఇతర అవసరమైన రికార్డులను పరిశీలించారు. దత్తత …

Read More »

సర్‌పై నాలుగు రోజుల ప్రత్యేక ప్రచారం

– ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో నిర్వ‌హ‌ణ‌ – క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీక‌ర‌ణ‌, ప‌రిష్కారంపై ప్ర‌త్యేక దృష్టి – ఓట‌ర్ల‌కు సేవ‌లందించేందుకు స‌మ‌న్వ‌యంతో కృషి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (స‌ర్‌) ప్ర‌క్రియ‌లో భాగంగా జులై 31న ముసాయిదా జాబితా ప్ర‌చుర‌ణ జ‌రిగింద‌ని.. అప్ప‌టి నుంచి ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు క్లెయిమ్‌లు, అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ నెల 22, …

Read More »

విజయవాడ నగరంలో పార్కులు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

-పర్యాటక ప్రాంతాలను ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలి -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మిశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని పార్కులు, పర్యాటక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు వాటిని ఆదాయ వనరులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మిశ సంబంధిత అధికారులను ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మిశ అధ్యక్షతన టూరిజం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలు, …

Read More »

యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్‌కు ప‌టిష్ట ఏర్పాట్లు

– ప్ర‌తి విష‌యంలోనూ అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాలి – అల‌స‌త్వానికి తావులేకుండా విధులు నిర్వ‌ర్తించండి – అధికారుల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) సివిల్ స‌ర్వీసెస్ మెయిన్ పరీక్ష‌లు ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని.. ఈ నేప‌థ్యంలో ప‌టిష్ట ఏర్పాట్లు చేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. గురువారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ యూపీఎస్సీ ఇన్‌స్పెక్ష‌న్ ఆఫీస‌ర్ ఎన్‌.రాజేశ్వ‌ర‌రావుతో క‌లిసి క‌లెక్ట‌రేట్ …

Read More »

ప్రత్యేక క్యాంపెయిన్ డేస్‌ను సద్వినియోగం చేసుకోవాలి

-ఓటర్ జాబితాలో తమ వివరాలను పరిశీలించుకోవాలి: వీఎంసీ కమిషనర్, డెప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 22, 23 మరియు 29, 30 తేదీల్లో అనగా శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు డెప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి ధ్యానచంద్ర తెలిపారు. ఈ ప్రత్యేక క్యాంపెయిన్ డేస్‌లో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత బూత్ లెవెల్ అధికారులు …

Read More »