Breaking News

Daily Archives: August 20, 2026

అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత, సేవలపై ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు తెలుసుకున్న కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం గులాబీతోటలోని అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అందిస్తున్న అల్పాహారం, భోజనం నాణ్యత, పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్యాంటీన్‌కు భోజనం చేసేందుకు వచ్చిన ప్రజలతో కమిషనర్ నేరుగా మాట్లాడి, అన్న క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహారం రుచి, నాణ్యత, పరిమాణం, ధరలు, సమయపాలన, సౌకర్యాలు తదితర అంశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందిస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరించి, …

Read More »

దోమల నివారణకు వీఎంసీ విస్తృత చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధుల నివారణకు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు వీఎంసీ ముఖ్య వైద్య ఆరోగ్య అధికారి డా. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో బయాలజిస్ట్ సూర్య నాయక్ దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్చార్జ్ డాక్టర్ గోపాల నాయక్ మాట్లాడుతూ, నగరంలో దోమల …

Read More »

చెరువుల అభివృద్ధికి ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ పరిధిలోని నల్లపాడు చెరువు మరియు యన్.టి.ఆర్ మానస సరోవరంలోని చెరువుల అభివృద్ధికి సంబంధించిన ప్రపోజల్స్ ను వారం లోగా సిద్దం చేసి ప్రభుత్వ అనుమతికి పంపాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఏపియుఐఎయంయల్ ప్రతినిధులను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపియుఐఎయంయల్) ప్రతినిధులతో నల్లపాడు చెరువు మరియు యన్.టి.ఆర్ మానస సరోవరంలోని చెరువుల అభివృద్ధికి ప్రత్యేక …

Read More »

రోడ్ నిర్మాణ పనులకు చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనులు పూర్తి కానున్నందున వెంటనే రోడ్ నిర్మాణ పనులకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనులను, పట్టాభిపురం మెయిన్ రోడ్ లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాన్నిపరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులు చివరి దశకు వచ్చినందున …

Read More »

వాకర్స్ కి కరూర్ వైశ్యా బ్యాంక్ వారు ఓపెన్ జిమ్ ఏర్పాటు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ కి కరూర్ వైశ్యా బ్యాంక్ వారు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. గురువారం బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో కరూర్ వైశ్యా బ్యాంక్ వారు ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం అందరూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతున్నారని, అటువంటి వారి కోసం కరూర్ వైశ్యా బ్యాంక్ …

Read More »

ఆగస్టు 21న ఇంద్రకీలాద్రిపై రూ. 52.50 కోట్లతో నిర్మించిన ‘అన్నప్రసాద సదనం’, ‘మహాప్రసాద భవనం’ ప్రారంభోత్సవం

-ఉదయం 11:32 గంటలకు శుభ ముహూర్తాన ప్రారంభించనున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు -ఒకే విడతలో 800 మందికి భోజన సదుపాయం.. త్వరలో అందుబాటులోకి ‘యాంత్రీకృత వంటశాలలు’ ​ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రూ. 52.50 కోట్ల భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన “శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం” మరియు “శ్రీ దుర్గా భవాని మహాప్రసాద భవనం” (లడ్డూ పోటు) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ​ఈ భవనాలను ఆగస్టు …

Read More »

వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువతే కీలకం

-బీజేవైఎం ఆధ్వర్యంలో ‘యంగ్‌ పొలిటికల్‌ లీడర్స్‌ డైలాగ్‌’.. 22, 23 తేదీల్లో విజయవాడలో సదస్సు…బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి -28 జిల్లాల నుంచి 500 మంది యువ ప్రతినిధులు.. వివిధ రంగాల నిపుణులతో చర్చలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2047 నాటికి భారత్‌ను వికసిత్‌ భారత్‌గా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌రెడ్డి పిలుపునిచ్చారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ‘వికసిత్‌ భారత్‌ యంగ్‌ పొలిటికల్‌ లీడర్స్‌ డైలాగ్‌’ కార్యక్రమాన్ని ఈ నెల 22, …

Read More »

‘ఎన్‌పీఎస్ అవగాహన సదస్సు’కు విశేష స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) సంయుక్త ఆధ్వర్యంలో ‘జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS)’పై ఈరోజు విజయవాడలో నిర్వహించిన అవగాహన సదస్సుకు పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రతినిధులు, అసంఘటిత రంగ సభ్యుల (unorganised sector members) నుండి విశేష స్పందన లభించింది. పీఎఫ్‌ఆర్‌డీఏ, ఎస్‌బీఐ పెన్షన్ ఫండ్స్ అధికారులు ఎన్‌పీఎస్ లక్షణాలు, పెట్టుబడి ఎంపికలు, పన్ను ప్రయోజనాలు మరియు ఇతర లాభాలను వివరించారు. …

Read More »

రేర్ ఎర్త్ మినరల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీని మారుస్తాం

– పర్మినెంట్ మేగ్నెట్స్ స్థానికంగానే తయారు చేసేలా చర్యలు – ఏపీ సముద్ర తీరంలో అపారమైన వనరులున్నాయి – రేర్ ఎర్త్ మినరల్స్‌పై ఏపీలో ప్రత్యేక కోర్సులు ప్రారంభించాలి – మంత్రి కొల్లు రవీంద్రకు ప్రతిపాదనలు అందించిన ఏయూ ప్రొఫొసర్ల బృందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రేర్ ఎర్త్ మినరల్స్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుంటే దేశ మైనింగ్ రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలిపుదామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర …

Read More »

ఐటీడీపీ డిజిటల్ సైనికులు సమిష్టిగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలి… : బుద్ధా వెంకన్న

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో నియోజకవర్గ ఐటీడీపీ (ITDP) సభ్యులతో గురువారం ఒక ముఖ్యమైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న ఐటీడీపీ సభ్యులకు భవిష్యత్తు కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ మరియు పార్టీ సేవా కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రతి ఇంటికీ, ప్రతి వ్యక్తికీ తెలిసే విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో డివిజన్ స్థాయి నుంచి ఐటీడీపీని …

Read More »