Breaking News

‘తానా’ సభలకు మంత్రి సవితకు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమెరికాలోని మిచిగన్ లో తానా ఆధ్వర్యంలో జరిగే తెలుగు మహా సభలకు రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి ఎస్.సవితను ఆహ్వానించారు. తానా సంస్థ ప్రతినిధులు బుధవారం అమరావతిలోని అసెంబ్లీలో మంత్రి సవితను కలిసి, ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఏడాది జులై మూడో తేదీ నుంచి అయిదు తేదీ వరకు మూడ్రోజుల పాటు తానా తెలుగు మహాసభలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, చిరంజీవి సహా ఎందరో ప్రముఖులు హాజరుకానున్నట్లు మంత్రి సవితకు తానా ప్రతినిధులు తెలిపారు. మూడ్రోజుల పాటు జరిగే తానా తెలుగు మహా సభలకు హాజరుకావాలని వారు మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సవిత సానుకూలంగా స్పందించారు. తానా మహాసభలకు హాజరుకానున్నట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో నాదెళ్ల గంగాధర్, సీహెచ్.ఉదయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *