Breaking News

వెంకటేశుని సేవలో మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్ నందు శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాలు బుధవారం వైభవంగా కొనసాగాయి. ఈ వేడుకలలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించి తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే హనుమాన్ చాలీసా వింటే సమస్త పీడలు, భయాలు తొలగిపోతాయన్నారు. అంజనీపుత్రుడైన ఆంజనేయుడు మహా బలవంతుడు, పరాక్రమశాలి అని.. అంతకుమించి శ్రీరామచంద్రునికి పరమభక్తుడిగా దాస్యభక్తిని చాటారన్నారు. ఎవరైతే ఆ అతులిత బలధాముని మనసారా సేవిస్తారో వారికి అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయని పేర్కొన్నారు. శ్రీవారి దివ్య ఆశీస్సులు, ఆ ప్రసన్నాంజనేయుని చల్లని చూపు నగర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుఫానుపై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

-నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ -ప్ర‌భావిత జిల్లాల యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం -తుఫాను గ‌మ‌నంపై ఎప్ప‌ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేత‌ అమరావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *