Breaking News

మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ

-నిడదవోలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మే9న జాబ్ మేళా
-పాల్గొననున్న 45 కంపెనీలు
-1302 మందికి ఉద్యోగాల కల్పన
-రూ.12,000 నుండి రూ.40,000 వరకు జీతం పొందే సువర్ణావకాశం
-నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపు

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు నియోజకవర్గంలో నిరుద్యోగులైన యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మే 9వ తేదీన స్థానిక ఎస్ వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.మంగళవారం నిడదవోలు మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మెగా జాబ్ మేళా పోస్టర్ ను మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వికాస సంస్థ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జాబ్ మేళాలో భాగంగా 1302 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉందన్నారు. తద్వారా రూ.12,000 నుండి రూ.40,000 వరకు జీతం పొందవచ్చన్నారు. జాబ్ మేళాకు ఇసూజూ, ఎల్ అండ్ టీ కన్ స్ట్రక్షన్, జీఎంఆర్ కార్గో, పానాసోనిక్,హెచ్ డీబీ ఫినాన్షియల్ సర్వీసెస్, అపోలో ఫార్మసీ, ఐసోన్ ఎక్స్ పీరియన్సెస్, స్మార్ట్ బ్రెయిన్స్, సాండ్ స్పేస్ టెక్నాలజీస్, డీలేట్ కర్ కార్పొరేట్, సదర్ ల్యాండ్, సినర్జీన్, ఈఎస్ఏఎఫ్, స్పందన, ముత్తూట్ ఫైనాన్స్, పైసా బజార్, రీసొల్యూట్, ఇండస్, ఎంసీవీ, ఇండో ఎంఐఎం, పిల్కింగ్టన్,ఇన్ ఫిలూమ్, హెచ్ డీఎఫ్ సీ, బీఎస్ సీపీఎల్, జీఎల్ఆర్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ తదితర 45 కంపెనీల ప్రతినిధులు రానున్నారని తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ పాసై మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకోవాలన్నారు. జీవితంలో స్థిరపడేందుకు అవకాశం కలుగుతుందన్నారు. నియోజకవర్గంలోని 35 ఏళ్లలోపు ఆసక్తిగల నిరుద్యోగ యువతీయువకులు తమ బయోడెటా, విద్యార్హత, సర్టిఫికెట్లతో మే9 వ తేదీన ఉదయం 9 గంటల నుండి నిర్వహించే జాబ్ మేళాకు హాజరుకావాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు.

జాబ్ మేళా కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను, జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ పురందేశ్వరి, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు పాల్గొంటారని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *