-క్రికెట్ తో పాటు అన్ని క్రీడా పోటీలు నిర్వహించాలి.
-చిత్తూర్ ప్రీమియర్ లీగ్ 2025
-క్రికెట్ టి 20 విజేత హైపియర్ ఇన్ స్పోర్ట్స్ జట్టు
-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్.ఎస్.
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరు ఆటల పోటీలలో పాల్గొనడం వల్ల ఓత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక ఎస్ వి తారకరామ స్టేడియం నందు ఈ నెల 23 నుండి 29 వరకు నిర్వహించిన మెగా చిత్తూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టి 20 లీగ్ 2025 విజేతలకు బహుమతులు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆటల పోటీలలో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని తెలిపారు.ఈనెల 23 నుండి 29 వరకు 7 రోజుల పాటు మంచి వాతావరణం లో క్రికెట్ పోటీలు నిర్వహించడం, అందులో 5 జట్లు పాల్గొనడం జరిగిందన్నారు. క్రికెట్ తో పాటుగా అన్ని క్రీడా రంగాల్లో టోర్నమెంటులు జిల్లాలో ఎక్కువగా నిర్వహించాలని చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారికి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఆటల పోటీలలో పాల్గొనడం ఎంతయినా అవసరమైనదని తెలిపారు, చాలా చక్కగా ప్రతిభ కనబరిచిన ఫైనల్ విజేతలైన హైపియర్ ఇన్ స్పోర్ట్స్ జట్టు మరియు పాయ్ వైస్ రాయ్ ఇరుజట్ల కు అభినందనలు తెలిపారు. అలాగే మూడవ విజేత అయిన ఆదిత్య గ్రూపు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు. మెదటి విజేతకు రెండు లక్షలు, రెండో విజేతకు ఒక లక్ష. మూడో విజేతకు యాభై వేలు రూపాయలు అందిచడం జరిగింది. అనంతరం విజేతలైన విన్నర్, రన్నర్ జట్లు సభ్యులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విజేతలకు మెమెంటోస్, ట్రోఫీ ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిపియల్ అధ్యక్షలు విజయకుమార్, మున్సిపల్ కార్పొరేటర్. నరసింహాచరి, క్రికెట్ అసోసియేషన్ సుభ్యులు, స్పాన్సర్స్, క్రికెట్ క్రీడాకారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News