Breaking News

భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా శ‌తాబ్ది వేడుక‌ల‌కు మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌కు ఆహ్వానం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 23న శ్రీ స‌త్య‌సాయి జిల్లా పుట్ట‌ప‌ర్తి ప్ర‌శాంతి నిల‌యంలో నిర్వ‌హించే భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా 100వ జ‌యంతి (శ‌తాబ్ది) వేడుక‌ల‌కు నిర్వాహ‌కులు వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ను ఆహ్వానించారు. స‌త్య సాయి సెంట్ర‌ల్ ట్ర‌స్టు ఏపీ అధ్య‌క్షుడు ఆర్‌. ల‌క్ష్మ‌ణ‌రావు సూచ‌న మేర‌కు ఆహ్వాన ప‌త్రిక‌ను ట్ర‌స్టు ప్ర‌తినిధులు గురువారంనాడు ఏపీ స‌చివాల‌యంలోని కార్యాల‌యంలో మంత్రికి అంద‌జేశారు.

రాష్ట్ర కార్య‌క్ర‌మంగా స‌త్య‌సాయిబాబా 100వ జ‌యంతి వేడుక‌లు
భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయిబాబా 100వ జ‌యంతి వేడుక‌ల్ని రాష్ట్ర కార్య‌క్ర‌మంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈమేర‌కు గ‌త‌నెల 30న‌ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్ట్ర టూరిజం, యువ‌జ‌న స‌ర్వీసుల‌ శాఖ నేతృత్వంలో ఈ వేడుక‌ల్ని నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుఫానుపై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

-నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ -ప్ర‌భావిత జిల్లాల యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం -తుఫాను గ‌మ‌నంపై ఎప్ప‌ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేత‌ అమరావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *