Breaking News

విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదం వెనక్కి పోయేనా…!

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి ల స్థానంలో నాయకులు మారినా విశాఖ ఉక్కు కార్మికుల నిరసన శిబిరాలు అలాగే ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రిగా, చంద్రబాబు రెండవసారి ముఖ్యమంత్రిగా, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా వారి పదవీకాలంలో ఉన్న ఎనాడు విశాఖ ఉక్కు పరిశ్రమ సమస్యలు పట్టించుకొనే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన, వైసీపీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభు త్వం అనేక సార్లు వేల కోట్ల ప్యాకేజ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖపట్నం నగరంలో స్థానిక పోలీస్ అధికారులు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి స్వచ్ఛంధ పదవీ విరమణ చేసేలా కుట్రలు చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఇంట్లో వ్యక్తికి క్యాన్సర్ వస్తే, పది వేల రూపాయలు జీతగాళ్ల కుటుంబం లో వాళ్ళు కూడా లక్షల రూపాయలు అప్పు చేసైనా కాపాడుకొనే ప్రయత్నం చేస్తారు. అలాంటిది కనీసం దాన్ని పట్టించుకొనే జ్ఞానం మోదీ, చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ లకు లేదని ఆయన దుయ్యబట్టారు. విశాఖ సభ లో రాహుల్ గాంధీ అధికారం చేపట్టిన వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ని నిధులతో నిలబెడ తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుండి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒక మాట ఇస్తే నిలబడతారనీ, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి చేపట్టగానే విశాఖ ఉక్కు సంస్థను ఆదుకుంటామనే హామీ నెరవేరుస్తామని కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి ప్రకటించారు. మూడేళ్లలో రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి 25 లోక్ సభ సీట్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
చంద్రబాబు, జగన్ విభజనకు మద్దతు ప్రకటించినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మ డిగానే ఉండాలని పోరాడిన వాడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మాట్లాడే హక్కు తనకు మాత్రమే ఉందని జగ్గారెడ్డి స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరి శెట్టి నరసింహరావు, ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వాలీ, ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వి. గురునాధం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలనుకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుఫానుపై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

-నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ -ప్ర‌భావిత జిల్లాల యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం -తుఫాను గ‌మ‌నంపై ఎప్ప‌ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేత‌ అమరావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *