Breaking News

ముగింపులో కార్గో ప్రచార మాసోత్సవం…

-సంస్థలోని 26 జిల్లాల ప్రజా రవాణా అధికారులకు, 4-జోన్ ఈ.డి. లకు స్వయంగా 30 కార్గో బుకింగ్స్ చేసిన ఎం.డి. సి.హెచ్ .ద్వారకా తిరుమల రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో, అందరికీ అందుబాటులో కార్గో సేవలను అందిస్తూ, ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. అందరి మన్ననలు పొందుతోంది. కార్గో ప్రచార మాసోత్సవం కూడా 25.07.2022వ తేది నుంచి 24.08.2022 వరకు నిర్వహించింది. ప్రచార మాసోత్సవ ముగింపులో భాగంగా, బుధవారం సంస్థ ఎం.డి. సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్., స్వయంగా విజయవాడ కార్గో కార్యాలయానికి వెళ్ళి 26 జిల్లాల ప్రజా రవాణా అధికారులకు మరియు 4-జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు తన వంతు బాధ్యతగా ”FAMILY WISDOM” అనే ‘మనో వికాస’ పుస్తకాన్ని డోర్ డెలివరీ విధానంలో పంపించారు. ప్రచార మాసోత్సవాలలో కార్గో వృద్దికి ప్రతి ఆర్టీసీ ఉద్యోగి తనవంతుగా ౩-కార్గో డోర డెలివరీ బుకింగ్స్ చేయాలని ఇప్పటికే సూచనలు చేసిన దరిమిలా, వారందరికీ స్పూర్తిని కలిగించేలా, RTC MD తన వంతు భాద్యతగా, 30 డోర్ డెలివరీ కార్గో బుకింగ్స్ ను చేయడం జరిగింది. ఎం.డి. సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్., విజయవాడ PNBS లోని ఎరైవాల్ బ్లాక్ లోని కార్గో కార్యాలయానికి చేరుకోగానే అక్కడి అధికారులైన జోన్-2 (విజయవాడ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వర రావు, కృష్ణా జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.వై. దానం సాదర ఆహ్వానం పలికారు.అనంతరం ఆయన స్వయంగా కార్గో కౌంటర్ ద్వారా పుస్తకాలు పంపించారు. అంతేకాకుండా ప్రతి ఒక్క అధికారికి పేరు పేరున ఆ పుస్తకం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, అటు ఉద్యోగ ధర్మాన్ని, ఇటు కుటుంబ భాద్యతలను సమ పాళ్ళలో నిర్వర్తిస్తూ ఉండాలని వారి కుటుంబ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ, ఒక ఉత్తరం కూడా ఆయన జత చేశారు. ఆ పుస్తకాన్ని తాను ఒక దశాబ్దం కిందట చదివానని, వ్యక్తిగత జీవితానికి, ఉద్యోగ జీవితానికి సంబంధించి ఎన్నో గొప్ప విషయాలు పొందుపరచబడిన ఆ పుస్తకం, అందరికీ మనో వికాసంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన ఆ ఉత్తరంలో ప్రస్తావించారు. ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా, ఎన్నో దేశాలలో ఎందరినో ప్రభావితం చేసిందని తెలుపుతూ, కార్గో ద్వారా అందరికీ పంపించడం ఆనందంగా ఉందన్నారు. కార్గోలో ప్రవేశపెట్టిన UPI (Unified Payments Interface) విధానాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్గో అధికారులు, బస్ స్టేషన్ ఏ.టి.ఎం(commercial), Dy. CTM (PNBS), విజయవాడ జోన్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *