-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సాగు చేసే ప్రతి ఒక్క రైతు ” పంట సాగుదారు హక్కు పత్రం (సి సి ఆర్ సి) ” తప్పని సరిగా కలిగి ఉండాలని తద్వారా ప్రభుత్వం కల్పించే ప్రయోజనాల కు అర్హులు అవుతారని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లో సి.సి.ఆర్.సి. గోడ ప్రతులను జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్టీ ఎస్సీ బీసీ, మైనార్టీ ఇతర వర్గాలకు చెందిన కౌలు రైతులకు వై ఎస్ ఆర్ భరోసా – పిఎం కిసాన్ కింద ఏటా రూ.13,500 పెట్టుబడి సహాయం అందించడం జరుగుతొందన్నారు. భూమి లేని కౌలు రైతులు, దేవాదాయ భూములను సాగుచేస్తున్న చిన్న, సన్నకారు రైతులు సిసిఅర్శి కార్డులు పొందుటకు యోగ్యత కలిగి ఉంటారన్నారు. అర్భికే, సచివాలయంలో సంప్రదించి గ్రామ రెవెన్యూ అధికారి ని సంప్రదించి పంట సాగుదారు హక్కు పత్రం పొంద వచ్చు అన్నారు.
భూ యజమాని లేదా వారి ప్రతినిధి, సాగుదారు మరియు వి ఆర్ వో ల సంతకాలతో సిసిఆర్సి పత్రం జారీ చేస్తామని మాధవీలత తెలిపారు. దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో 11 నెలల కాల పరిమితి తో సిసిఆర్సి కార్డు చెయ్యడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పత్రం కలిగిన సాగుదారుకు రైతు భరోసా కింద ఏటా రూ.13500/- ఉచిత పంట బీమా, సున్నా వడ్డీ పథకం లబ్ది, పంట నష్ట పరిహారం నేరుగా పొంద గలుగుతారు అని పేర్కొన్నారు.
తద్వారా ప్రభుత్వం ద్వారా మద్దతు ధర కు పంట కొనుగోలు, రాయితీ పై నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందగలుగుతారని పేర్కొన్నారు.
రైతులకు భరోసా ఇచ్చే సిసి ఆర్సి కార్డు ద్వారా భూ యజమానులకు కూడా ప్రభుత్వ పరంగా భరోసా కల్పించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. సాగు దారు హక్కు పత్రం పై భూ యజమాని సంతకం చెయ్యడం వల్ల భూ యజమాని భూహక్కులకు ఎటువంటి భంగం కలగదన్నారు. సిసిఆర్సి పత్రం అమలు లో 11 నెలల వ్యవధి లో పండించిన పంట పై మాత్రమే కౌలు/సాగు దారు హక్కులు కలిగి ఉంటారని పేర్కొన్నారు. బ్యాంకు రుణం కి సంబంధించి భూ యజమానులకు ఎటువంటి భారం ఉండదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, హర్టి కల్చర్ అధికారి పి. రాధాకృష్ణ, జిల్లా పశువైద్య అధికారి డా ఎస్ జి టి సత్య గోవింద్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News