విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన ప్రముఖ రచయితలు మధురాంతకం నరేంద్ర, వరాల ఆనంద్‌లను గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. హిందీ సాహిత్యం నుంచి అనువదించబడిన ‘మనోధర్మ పరగం’, ‘ఆకుపచ్చ కవితలు’ సాహిత్యానికి గాను 2022 సంవత్సరానికి వీరిరువురు అవార్డులు గెలుచుకున్నారు. వీటిని హిందీలో గుల్జార్ విరచించారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ సాహిత్యలోకం ఈ విజయాన్ని చూసి గర్వపడుతుందని, భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో అవార్డులను రాష్ట్ర కవులు, రచయితలు గెలుచుకోవాలని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News