Breaking News

దిల్లీ భేటీ వివరాలను జగన్మోహన్‌రెడ్డి వెల్లడిరచాలి

-లక్షలాది పెన్షన్లు, రేషన్‌కార్డుల కోత
-జగనన్న కాలనీ ఇళ్లు, టిడ్కో ఇళ్ల సాధనకై ఉద్యమం
-ఫిబ్రవరి 6న నిరసనలు`22న విజయవాడలో మహాధర్నా
-మూడున్నరేళ్లల్లో ఇరిగేషన్‌ రంగంపై జగన్‌ నిర్లక్ష్యం
-ఫిబ్రవరి 8-14 వరకు సీపీఐ బృందం సాగునీటి ప్రాజెక్టుల సందర్శన
-విశాఖ ఉక్కు కార్మిక గర్జనకు సంఫీుభావంగా జనవరి 23, 24, 25 తేదీల్లో దీక్షలు
-ప్రధాని మోదీ తల్లి మృతికి సీపీఐ సంతాపం
-మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి, వివిధ అంశాలపై ఢల్లీిలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ అయిన అంశాల్ని, కేంద్రం స్పందించిన తీరును తక్షణమే సీఎం మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలకు వెల్లడిరచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు.
విజయవాడ దాసరిభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తొలుత ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ మృతికి సీపీఐ తరపున సంతాపాన్ని, మోదీ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఇటీవల సీఎం జగన్‌ దిల్లీ వెళ్లి ప్రధాని మోదీని, ఇతర కేంద్ర మంత్రులు అమిత్‌షా తదితరులను కలిశారని గుర్తుచేశారు. తిరుపతిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని జగన్‌ కోరినట్లు, ప్రత్యేక హోదా, నిధులు, పోలవరం నిర్మాణం అంశాలపై జగన్‌ అర్జీలు ఇచ్చినట్లు పత్రికల్లో వచ్చాయన్నారు. ఇలాంటి అర్జీలు జగన్‌ ఇప్పటికే చాలా ఇచ్చినప్పటికీ, ఫలితాలు మాత్రం రావడం లేదని దుయ్యబట్టారు. జగన్‌ కోరిన కోర్కెలపైన కేంద్ర మంత్రుల నుంచి స్పందనే లేదనీ, అసలు అటువైపు నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడం చాలా అనుమానాలకు తావిస్తోందన్నారు. రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కేంద్రం స్పందించలేదనీ, జగన్‌ మాత్రం అక్కడకు వెళ్లి పోర్టు ఏర్పాటు చేస్తానని చెబుతున్నారని పేర్కొన్నారు. విభజన హామీలపై స్పష్టమైన ప్రకటన ఇవ్వకుండా మోదీ, జగన్‌ రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. కనీసం ప్రతిపక్ష పార్టీలతోనూ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించడం లేదనీ, దిల్లీలో జరిగిన అంశాలపై జగన్‌ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. సంక్షేమ పధకాలపై ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటూ…పేదలను వాటికి దూరం చేస్తున్నారని విమర్శించారు. పెన్షన్‌ రూ.250 పెంచిన జగన్‌, కుంటిసాకులు చూపిస్తూ పెన్షన్‌దారుల సంఖ్యను మాత్రం తగ్గించేస్తున్నారనీ, దీంతో ఉన్న పెన్షన్‌దారుల్లో సైతం ఆందోళన నెలకొందన్నారు. నెలకు యాభై వేలమంది పెన్షన్‌దారులను, లక్షలాది మంది రేషన్‌ కార్డుదారులకు కోత విధిస్తున్నారని వివరించారు. అసలు ఇల్లే లేని వారికి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని కోతపెట్టడం దుర్మార్గమన్నారు. జగనన్న కాలనీల కింద 32 లక్షల ఇళ్లు ఉచితంగా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహనరెడ్డి ఇప్పుడు లబిద్దారులను బెదిరిస్తారా? అంటూ నిలదీశారు. పునాదులు వేసుకున్న పేదలు మధ్యలోనే నిర్మాణాలను నిలిపివేసే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రతి ఇంటి నిర్మాణానికీ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టిడ్కో ఇళ్లను ఇంతవరకు పూర్తిచేయకుండా, బయట రంగులు వేసి ప్రచారం చేసుకుంటున్నారన్నారు. వాటికి లోపల పనులు మాత్రం చేయకుండా నిలిపివేశారనీ, వారందరికీ సంక్రాంతి నాటికి టిడ్కో ఇళ్లను కేటాయించాలని, లేకుంటే వాటిపై ఒక నిరవధిక ఆందోళనకు సీపీఐ సిద్ధమవుతోందన్నారు.
జనవరి 17 నుంచి 31 వరకు క్షేత్రస్థాయిలో అన్ని చోట్ల జగనన్న కాలనీ ఇళ్లు, టిడ్కో ఇళ్ల సమస్యలపై లబ్దిదారులతో కలిసి ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అప్పటికీ ఎలాంటి స్పందన లేకుంటే ఫిబ్రవరి 6వతేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడతామని ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే దీనిని రాష్ట్రస్థాయి ఉద్యమంగా చేపట్టి… ఫిబ్రవరి 22వ తేదీ వేలాది మందితో విజయవాడలో మహా ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. జగనన్న కాలనీలకు డబ్బులు లేవనీ, టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా జగనే అడ్డు పడుతున్నారనీ ధ్వజమెత్తారు.
నర్సీపట్నం వద్ద ప్రాజెక్టు శంకుస్థాపనకు జగన్‌ వెళ్లారన్నారు. ఈ మూడున్నరేళ్ల జగన్‌ పాలనలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. జగన్‌ కేంద్రంపై గట్టిగా ఒత్తిడిచేసి నిధులు తీసుకురాలేక పోతున్నారని ధ్వజమెత్తారు. సీఎం సొంత జిల్లా కడపలో కూడా ఒక ఎకరాకు నీరు ఇవ్వలేక పోతున్నారంటూ ఎద్దేవా చేశారు. పైపెచ్చూ ఢల్లీిలో జగన్‌ రాయలసీమ ఎత్తిపోతల పథకాలపై మాట్లాడటం ఆక్షేపణీయమన్నారు. ప్రాధాన్యత క్రమంలో ఎక్కడా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు లేవనీ, జలయజ్ఞం చేపట్టిన వైయస్‌ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌…రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రాజెక్టులను సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇరిగేషన్‌ రంగం పూర్తిగా పడకేసిందని దుయ్యబట్టారు. ఫిబ్రవరి 8 నుంచి 14వ తేదీ వరకు సీపీఐ బృందం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తుందనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాజెక్టుల నిర్మాణంకోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వెల్లడిరచారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు జనవరి 27న లక్షమందితో కార్మిక గర్జనపేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని తెలిపారు. దానికి సీపీఐ సంపూర్ణ సంఫీుభావం తెలుపుతూ…జనవరి 23, 24, 25 తేదీలలో అన్ని జిల్లాల కలెక్టర్‌, ఆర్డీవో కార్యాలయాల వద్ద దీక్షలు చేపడతామని వెల్లడిరచారు. విశాఖఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్కడ 680రోజులుగా అన్ని కార్మిక సంఘాలు కలిసి పోరాటం జరుగుతున్నప్పటికీ…పాలకులు స్పందించడం లేదన్నారు. మోదీ, జగన్‌ చర్యల్ని తీవ్రంగా ఖండిరచారు. అందుకే విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తమ వంతుగా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.

కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలు లేదా విజయవాడలో ఉంచాలి: ఓబులేసు
కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడ లేదా కర్నూలులో ఉండాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు డిమాండ్‌ చేశారు. విశాఖలో బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలన్న జగన్‌ ప్రభుత్వ ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలన్నారు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదనీ, కృష్ణా జలాలతో విశాఖకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ బోర్డును కర్నూలులోనే పెట్టాలనీ, లేకుంటే విజయవాడలోనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యాలయం అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ పంపిణీ సంస్థల పునర్వవస్థీకరణ పేరుతో అటు వినియోగదారులను, ఇటు ఉద్యోగస్తులకు మొత్తంగా వ్యవస్థకే తీవ్రంగా నష్టం కలిగించే పద్దతుల్లో తీసుకొస్తోందన్నారు. స్మార్ట్‌ మీటర్ల పేరుతో ప్రజలపై భారాలు మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే విద్యుత్‌ పంపినీ సంస్థల పునర్వవస్థీకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఏఐకేఎస్‌ అధ్యక్షులు రావుల వెంకయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *