-తురక నరసింహ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈరోజు, డి నోటిఫైడ్, నోమాడిక్ అండ్ సెమి నోమాడిక్ కమ్యూనిటీస్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మెంబర్ తురక నరసింహా సందర్శించి, పబ్లిక్ పాలసీ అండ్ యంత్రపాలజీ విద్యార్థులతో చర్చ గోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని, భిన్నత్వంలో ఏకత్వ ప్రత్యేకతని రాబోయే తరాలకు అందించే దిశగా పయనించాలని కోరారు. కాబోయే సివిల్ సర్వెంట్స్ సమాజానికి అంకిత భావంతో, నిస్వార్థ సేవలు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ విభాగాధిపతులతో సమావేశమై మహిళా సాధికారతకు, ముఖ్యంగా ముఖ్య గ్రామీణ మహిళాభివృద్ధికి వివిధ విభాగాలు చేపడుతున్నటువంటి కార్యకలాపాలను చర్చించి, కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక పథకాలను సద్వినియోగం చేసుకుంటూ , మహిళ సాధికారత కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ చిన్నయ్య గారు వర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ రజిని , డీన్లు, విభాగాధిపతులు విద్యార్థులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News