Breaking News

విశ్వశాంతిని కోరుతూ నిర్వహించే జితో అహింసా మారథాన్ ను జయప్రదం చేయండి.

-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ విశ్వశాంతిని కోరుతూ జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జితో రన్ లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు కోరారు. విశ్వశాంతిని కోరుతూ ఏప్రిల్ 2వ తేదీన జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అహింసా మారథాన్ కు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు శనివారం ఆయన కార్యాలయంలో విడుదల చేసారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోట్లాది సంవత్సరాలుగా ప్రకృతి మనకు ఎన్నో వనరులను ప్రసాదించిందన్నారు. వాటిని కాపాడుకోవలసిన అవసరం సమాజంలో ప్రతిఒక్కరిపై ఉందన్నారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా విశ్వశాంతిని కోరుతూ పలు సామజిక కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఐకమత్యం, అహింసా, శాంతి వంటి సామజిక కార్యక్రమాలను నిర్వహించే క్రమంలో భాగంగా దేశ ప్రజలు ఐకమత్యం, అహింసా, శాంతి మార్గాలతో నడవాలని ప్రతీ ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ ఏప్రిల్ 2వ తేదీన నగరంలో అహింసా రన్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు అన్నారు. దేశ వ్యాప్తంగా 65 నగరాలలో అహింసా శాంతిని కోరుతూ 3కే, 5కే ,10కే విభాగాలలో మారథాన్ నిర్వహిస్తున్నారన్నారు.
దేశవ్యాప్తంగా 65 నగరాలలో నిర్వహించే రన్ లో వేలాదిగా పురుషులు, స్త్రీలు, మహిళలు, చిన్నారులు పాల్గొని జయప్రదం చేయడం ద్వారా అహింసా, శాంతి మార్గాలను అనుసరించాలని కోరుతున్నామన్నారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంస్థకు దేశవ్యాప్తంగా 68 చాప్టర్స్, ప్రపంచవ్యాప్తంగా 26 చాప్టర్స్ తో సామాజిక ఆర్థిక సేవా దృక్పథం నేపథ్యంలో యూవత , మహిళ ఆర్గనైజేషన్ విభాగాలు ప్రపంచవ్యాప్తంగా అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూన్నారన్నారు ఏప్రిల్ 4వ తేదీన శాంతి, అహింసలను కోరుకునే మహావీర్ జయంతిని పురస్కరించుకొని పలు కార్యక్రమాలను చేపడుతున్నారని ఇందులో భాగంగా అహింస మారథాన్ ను నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు.
జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విజయవాడ చాప్టర్ చీఫ్ సెక్రటరీ మనీష్ దోషి మాట్లాడుతూ తమ ఆర్గనైజేషన్ విజ్ఞానం, ఆర్థిక-సాధికారత మరియు సమాజ సేవ అనే మూడు ప్రధాన లక్ష్యాలతో పనిచేస్తుందన్నారు. గ్లోబల్ ఆర్గనైజేషన్ ప్రపంచ స్నేహం సామాజిక-ఆర్థిక సాధికారత, విలువ-ఆధారిత విద్య, సమాజ సంక్షేమం, కరుణ తోటి జీవుల పై మమకారం ఆధ్యాత్మికాభివృధి సాధించడానికి జితో కృషి చేస్తుందని తెలిపారు.
ప్రస్తుతం మానవ విలువలు క్షిణిస్తున్న కాలంలో శాంతి గురించి అవగాహన కల్పించడం, శాంతి మార్గాలలో పయనించేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలనే ఉద్దేశంతో నిర్వహించే అహింస రన్‌లో ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు. నగరంలో పదివేల మంది పురుషులు, మహిళలు, చిన్నారులు శాంతిని కాంక్షిస్తూ అహింసా రన్ లో పాల్గొనాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అహింస రన్ పాల్గొనాలానే ఉత్సహవంతులు www.ahimsarun.com ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9440280906 నందు సంప్రదించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చైర్మన్ అశోక్ గోలీషా, మహిళా విభాగం చైర్మన్ త్రప్తి జైన్, చీఫ్ సెక్రటరీ సంగీత నీనావర్త్, మీడియా కో ఆర్డినేటర్ ప్రవీణ్ రంత, జైన్ సంఘా ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *