-సైనిక సంక్షేమ నిధికి విరాళాలు అందించి సైనిక కుటుంబాలను ఆదుకోండి… జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశం కోసం ఆహర్నిసలు సేవలు అందింస్తూ విధి నిర్వహణలో అటుపోట్లను ఎదుర్కొంటున్న సైనిక సంక్షేమ నిధికి స్వయం సహాయక బృందాల సభ్యులు విరాళాలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని, వీరిని స్పూర్తిగా తీసుకుని సైనిక సంక్షేమ నిధికి విరాళాలు అందించి సైనిక కుటుంబాలను అదుకునేందుకు కలెక్టర్ డిల్లీరావు కోరారు. నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో సోమవారం జిల్లాకు చెందిన స్వయం సహాయక బృందాల సభ్యులు అందించిన విరాళానికి సంబంధించిన చెక్‌ను జిల్లా సమాఖ్య సభ్యులు జిల్లా కలెక్టర్ డిల్లీరావుకి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ దేశ రక్షణకు ప్రాణాలను అర్పించి అమర వీరులైన సైనిక కుటుంబాలను ఆదుకోవాల్సిన భాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్వయం సహాయక బృందాలు మహిళల ఆర్థిక పురోగతికి ప్రభుత్వం అందించిన సహకారాన్ని వినియోగించుకుంటూ సంపాధించిన దానిలో కొంత సంక్షేమ నిధికి విరాళంగా అందించేందుకు స్వచ్చందగా ముందుకు వచ్చినందుకు స్వయం సహాయక బృందాలను ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. జిల్లాకు చెందిన 25,097 స్వయం సహాయక సంఘాల జిల్లా సమాఖ్య సభ్యులు 7 లక్షల 62 వేల 892 రూపాలయ సాయుధ దళాల పతాక నిధికి విరాళ చెక్కును అందించిన వారి దాతృత్వాన్ని స్పూర్తిదాయకంగా తీసుకోవాలన్నారు. దేశ రక్షణ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భారత జవానుల ధైర్యసహసాలు తెగువకు జాతి యావత్తు గర్విస్తుందన్నారు. ఆయా సమయాలలో ఎంతో మంది జవానులు వీరమరణం పొందరన్నారు. మనం స్వేచ్చంగా జీవించగలుగుతునామంటే అందుకు కారణం భారత సైనికుల రక్షణే కారణమన్నారు. దేశ రక్షణలో పాటుపాడుతున్న ప్రతి సైనికునికి మనం ఎంతో రుణపడి ఉన్నామన్నారు. వీర మరణం పొందిన సైనికుల తల్లిదండ్రులు, వితంతువు అయిన భార్య పిల్లలకు మనకు తోచిన రీతిలో స్పందించి విరాళాలు అందించడం ద్వారా కొంత మేరకు లోటు తీర్చగలిగే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. స్వచ్చందంగా విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చేవారు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జిల్లా సైనిక సంక్షేమ అధికారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతా 62067742138 ఐఎఫ్‌ఎస్సి కోడ్ ఎస్‌బిఐఎన్ 0020899 ద్వారా నేరుగా తమ విరాళాలు అందించవచ్చునని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు. జిల్లా కలెక్టర్ ద్వారా సైనిక సంక్షేమ నిధికి డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ కె. శ్రీనివాస్, డిపియం యం సునీత లక్ష్మి, జల్లా సమాఖ్య అధ్యక్షలు కె. సీత కార్యదర్శి కె. రాణి, కోశాధికారి పిజ లియోనా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News