విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయ నాయకులకు సేవే పరమావధి కావాలని ఆకాంక్షించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్,ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు రాష్ట్ర వైస్సార్సీపీ సీనియర్ నాయకులు బుచ్చిబాబు తెలిపారు. ఆదివారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలో 11వ డివిజన్ నందు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించినప్పుడు నిరుపేద కుటుంబాలకు చెందిన అరసివేల్లి సత్యావతి,మాడా యశోద ఇబ్బందులు పడుతున్న విషయం స్థానిక డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్ దేవినేని అవినాష్ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అన్నారు.అవినాష్ వెంటనే స్పందించి దేవినేని రాజశేఖర్ నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 30,000/-రూపాయల విలువ గల రెండు తోపుడు బండ్లును ఉచితంగా అందజేశారు.ఈ సందర్భంలో కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ దేవినేని నెహ్రూ గారు ఎప్పుడు కూడా పేదలకు అండగా ఉండేవారని, కష్టం అంటూ ఎవరు ఇంటికి వచ్చిన కులమత పార్టీలకతీతంగా వారికి అండగా నిలిచి, సమస్య పరిష్కారానికి కృషి చేశారని,నేడు ఆయన తనయుడు దేవినేని అవినాష్ గారు కూడా అదేబాటలో నడుస్తూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, ఉపాధి కల్పన కోసం అనేక సేవ కార్యక్రమలు చేపట్టడం జరిగిందని వివరించారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్,వైస్సార్సీపీ నాయకులు సొంగా రాజ్ కమల్,సాంబశివరావు, వాసు,చోటు,మంగి శ్రీను,హేమంత్,ఇందిరా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News