Breaking News

తెనాలి, మాచర్ల, అనంతపురం లో జరిగిన సంఘటలను తీవ్రంగా పరిగణించిన ఈసీ…

-గృహనిర్బంధంతోపాటు కేసులు పెట్టాలని ఆదేశం
-పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్ఐ ని సస్పెండ్ చేయాలని ఆదేశం
-సాయంత్రం 4 – 6 గంటల మధ్య ఎట్టువంటి సంఘటనలు జరిగినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలుచోట్ల పలు దుర్ఘటనలు జరగడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారం ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా పరిగణించారు. తెనాలి, మాచర్ల, అనంతపురం లో జరిగిన సంఘటలకు బాధ్యులైన వారిని వెంటనే గృహ నిర్బంధం చేయటంతో పాటు కేసులు పెట్టాలని ఆయా జిల్లాల ఎన్నికల, పోలీస్ యంత్రాంగాలను ఆదేశించారు. పుంగనూరులో జరిగిన సంఘటనలో నిందితులను వదిలేసిన ఎస్ఐ ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సాయంత్రం 4 – 6 గంటల మధ్య ఎట్టువంటి సంఘటనలు జరిగినా అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు అక్టోబర్ 2న శంకుస్థాపన

-మదనపల్లెలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు -29వ తేదీ పల్లె పండుగ, 30వ తేదీన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *