Breaking News

జూనియర్ కళాశాలలో ఘనంగా ప్రారంభించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం

-మానవతా ట్రస్టు ఆధ్వర్యంలో 500 స్టీల్ గ్లాసులు, 500 భోజనం ప్లేట్లు ఉచితంగా వితరణ
-పాల్గొన్న ఎమ్మెల్యే లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించడం జరిగిందనీ, ఇందుకు విద్యార్థులు , వారి తల్లిదండ్రులు తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరులు శాఖ మంత్రి నారా లోకేష్ లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాస్ లు పేర్కొన్నారు. శనివారం స్ధానిక జూనియర్ కళాశాల లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, గోదావరి కి బ్యారేజ్ కట్టని సమయంలో వరదలు కారణంగా కరువు కాటకాలు వొచ్చేవి, ఆకలితో అలమటించే వారికీ అన్నం పెట్టిన గొప్ప మహోన్నత వ్యక్తి డొక్కా సీతమ్మ గారు, అటువంటి మహోన్నత వ్యక్తి పేరు మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టడం ఎంతో సముచితం అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీటు రావడం చాలా కష్టం, ఇక్కడ ఎంతో ప్రతిభ కలిగిన లెక్చరర్స్ ఉన్నారు, ఇక్కడ ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, వొచ్చే నీట్ పరీక్ష ఫలితాల్లో 20 మంది కనీసం ఎంపిక కావాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు కోసం మధ్యాహ్న భోజన పథకం కింద 100 శాతం నమోదు కావాలని కోరారు. ఈ కళాశాలకు చెందిన పనులు పూర్తి చెయ్యడం జరుగుతుందని, మాటల్లో కంటే చేతల్లో చూపించడం ముఖ్యం అన్నారు. ఆదిశలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యుల పేర్కొన్నారు.

శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, మీ భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోవడం మీ చేతుల్లో ఉందని, అందుకే మీకు మీరే హీరోలు, హీరోయిన్స్ అనడం జరిగిందన్నారు. తల్లితండ్రుల మీద ఒత్తిడి లేకుండా చూడాలని ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. ఇస్కాన్ సంస్ధ ద్వారా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందజేయడం జరుగుతుందన్నారు. డొక్కా సీతమ్మ గారు ఆకలితో ఉన్న వారికి లేదనకుండా అన్నం వండి తినిపించే వారిని, అటువంటి వారినీ మరచిపోకూడదు అని ఆ పేరు పెట్టడం జరిగిందనీ తెలిపారు. గత ప్రభుత్వం కోడి గుడ్లు సరఫరా చేసిన వారికీ బకాయి పెట్టిన రూ.200 కోట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించడం జరిగింది. అదే విధంగా ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ పథకాల అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఒకరికింద ఉద్యోగం చెయ్యడం కాదు 4మరో పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి కి చేరుకోవాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు.

మానవతా ట్రస్టు ఆధ్వర్యంలో 500 స్టీల్ ప్లేట్స్, 500 స్టీల్ గ్లాసులు వితరణ అందించడం అభినందనీయం అని ప్రిన్సిపల్ ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం పేర్కొన్నారు. జూనియర్ కళాశాల ప్రగతి నివేదిక అందచేశారు.

ఈ కార్యక్రమంలో  జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం , బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీవీ శారద దేవి, స్ధానిక నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రవి , మానవతా ట్రస్టు ఛైర్మన్ ప్రసాద రెడ్డి, సభ్యులు సిపి మెహర్ మధు, బి. మురళీ, కళాశాల లెక్చరర్లు, విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *