Breaking News

“పి జి ఆర్ ఎస్ – మీ కోసం”  లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్నీత కాలవ్యవధిలో పరిష్కరించాలి.

-ఆర్డీవో కృష్ణ నాయక్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి స్థాయి న్యాయం చెయ్యాలని ఆర్డీఓ ఆర్. కృష్ణ నాయక్  డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” వేదిక లో వచ్చిన అర్జీలను డివిజన్ స్థాయి అధికారులతో కలసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “పి జి ఆర్ ఎస్ – మీ కోసం”  ద్వారా  ప్రజల నుంచి 5 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు.  ప్రతి అర్జీని నిర్నీత కాల వ్యవధిలో పరిష్కరించి దరఖాస్తుదానికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.

ఈరోజు అర్జీలు.

రాజమహేంద్రవరం, రామదాసు పేటకు చెందిన టి. సుధీర్ అనే వ్యక్తి తనకు వృద్ధాప్య పింఛను మంజూరు చేయవలసినదిగా కోరుతూ దరఖాస్తు నందు పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం, కాతేరు గ్రామానికి చెందిన జి. శ్రీదేవి అనే మహిళ తన భూమిని పక్క పొలం వారు ఆక్రమించినందున ఇది సర్వే చేసి సరి చేయవలసినదిగా దరఖాస్తు నందు కోరి ఉన్నారు.

గోకవరం మండలం, కృష్ణుని పాలెం గ్రామానికి చెందిన ఎం. తరంగిణి తన భూమిని ప్రక్క పొలం వారు ఆక్రమించుకున్నందున తనకు రీ సర్వే చేసి సమస్యలు పరిష్కరించవలసిందిగా దరఖాస్తు నుండి పేర్కొన్నారు.

కోరుకొండ గ్రామానికి చెందిన బి. వెంకట్రావు అనే వ్యక్తి తన భూ సరిహద్దు దాటి తన భూమి ఆక్రమించినందున తగు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ దరఖాస్తు చేసుకొని ఉన్నారు.

సీతానగరం గ్రామానికి చెందిన ఎం. నరసింహమూర్తి అనే వ్యక్తి చాలా సంవత్సరాలుగా తనకు పింఛను రావడంలేదని, తనకు పింఛను మంజూరు చేయవలసినదిగా కోరుతూ దరఖాస్తు చేసుకొని ఉన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *